end
=
Saturday, April 12, 2025
వార్తలురాష్ట్రీయందేశభక్తితో కూడిన ప్రేమకథ
- Advertisment -

దేశభక్తితో కూడిన ప్రేమకథ

- Advertisment -
- Advertisment -

మానవత్వాన్ని చాటిన `బొంబాయి` కి 30 ఏళ్ళు

ద‌ర్శ‌క దిగ్గ‌జం మ‌ణిర‌త్నం చాలా సెన్సిటివ్ స‌మస్య‌తో మరపురాని పాటలను బొంబాయి చిత్రంలో మిళితం చేసిన విధానమే అద్భుతం. ఈ చిత్రం 11 మార్చి 1995న విడుద‌లై సంచ‌ల‌న‌మైంది. చిత్రానికి అక్ష‌రాలా 30 ఏళ్లు పూర్త‌య్యాయి. సినిమాలో కోర్ ఎలిమెంట్ లో సీరియస్ నెస్ ఉంది కానీ దాన్ని ప్రేమకథ(love story)తో మలిచిన తీరు మాత్రం మాటలకందని భావోద్వేగాన్ని, మరిచిపోలేని అనుభూతిని కలిగించింది, అది మణిరత్నం గారికే చెల్లింది. ఇండియన్ స్క్రీన్ పై జరిగిన అద్భుతాల్లో మణిరత్నం బొంబాయి ఒకటి. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ లో వచ్చే పాట వరకు ఏ.ఆర్.రెహమాన్ (ar rahman) ఇచ్చిన మ్యూజిక్ గురించి ఎంత చెప్పిన తక్కువే. హమ్మ హమ్మ పాట, ఉరికే చిలకా, కుచ్చి కుచ్చి కూనమ్మ , మతమేల గతమేలన్ని బ్లాక్ బస్టర్ హిట్సే…ఇక బ్యాగౌండ్ మ్యూజిక్ కి ఐతే కొన్ని చోట్ల గూస్ బంప్సే, ఇళయరాజా తరువాత ఆ స్థాయిని స్థానాన్ని తన ప్రతిభతో పట్టాభిషేకం చేయించుకున్న రెహమాన్ దే. బషీర్ గా కిట్టీ నారాయణ్ పిళ్ళై గా నాజర్ యాక్టింగ్ మూవీ కే హైలైట్. మతాల పై ఎంత ప్రేమ ఉన్నప్పటికి పిల్లల పై ఉన్న ప్రేమ వారిని అంత మరిపింప చేస్తుంది..ఇలాంటి కాంప్లికేటెడ్ సీన్స్ లో ఈ ఇద్దరి పర్ఫార్మెన్సె మూవీకే వన్ ఆఫ్ ది హైలైట్. చాలామంది గమనించి ఉండకపోవచ్చు ఇందులో ప్రకాష్ రాజ్ (prakash raj)ఉన్నాడు, పోలీస్ క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ కి అరవింద్ స్వామి(aravind swamy)కి మధ్య సీన్ ఆ డైలాగ్స్ సూపర్ గురూజీ, ఈ సినిమాలో మనీషా కోయిరాలా ని చూసి ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి, పెళ్ళి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకోని కుర్రాళ్ళు లేరు అప్పట్లో… మనీషా కోయిరాలా అందం, అభినయం ఓ ప్రత్యేక ఆకర్షణ బొంబాయి చిత్రానికి, కొన్ని కొన్ని ఎక్స్ ప్రెషన్స్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటాయి. సెకండాఫ్ లో రాళ్ళపల్లి హిజ్ర పాత్ర లో చేసిన నటన, బషీర్ కి నూతన ప్రసాద్ చెప్పిన డబ్బింగ్ , వేటూరి లిరిక్స్…ఇలా ఎంతో మంది టాలెంటెడ్ వ్యక్తులని ఓ ప్రాపర్ వే లో కలుపు కొని అద్భుతమైన చిత్రాన్ని ఇచ్చిన సినీ నవాబ్ మణిరత్నం. క్లైమాక్స్ లో వచ్చే .. మతమేల గతమేల మనసున్న నాడు,హితమేదో తెలియాలి మనిషైన వాడు.. పాట తో సినిమా ఎండైనప్పుడు గుండే లోతుల్లో ఏదో తెలియని ఓ ఫీలింగ్.

– విశ్వ‌టాకీస్‌
90309 38479

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -