end

Rahul Jodo Yatra :మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే..

  • దేశంలో మతతత్వ శక్తుల దౌర్జన్యం
  • తెలంగాణ రాష్ర్టంలో దొరల పాలన
  • హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
  • దేశ సమైక్యత కోసం ఈ యాత్ర సాగుతుందని వెల్లడి

భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ప్రస్తుతం తెలంగాణలో (Telangana) కొనసాగుతోంది. ఈ మేరకు మంగళవారం (Tuesday)హైదరాబాద్ (hyderabad)చేరుకున్న ఈ యాత్రలో భాగంగా సాయంత్రం నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌ (corner meeting)లో రాహుల్ గాంధీ (Rahul gandhi)కీలక ప్రసంగం చేశారు . ఈ సభలో భారత దేశ రాజకీయాలను ఉద్ధేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై (Narendra modi)సంచలన కామెంట్స్ చేశారు. యావత్ దేశ సంపదను ఆ ముగ్గురికే దోచిపెడుతున్నారని, లక్షల కోట్ల సొమ్ము మోదీ స్నేహితుల జేబుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ (Kanyakumari to Kashmir) వరకు చేపట్టిన కాంగ్రెస్ (CONGRESS)భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కీలక ప్రసంగం చేశారు రాహుల్. తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) సహా, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ (MODI)అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టారు. కేసీఆర్, నరేంద్ర మోదీ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. ఇక్కడ దొరల పాలన.. అక్కడ మతతత్వ శక్తుల దౌర్జన్యాలతో ప్రజల జీవనం అస్తవ్యస్థంగా మారిందన్నారు. సమైక్యవాద దేశాన్ని విభజిస్తున్న బీజేపీ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణలో దొర కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు రాహుల్.

(Munugode:మునుగోడులో ఈటలపై దాడి..)

ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య డైరెక్ట్ లింక్ (Direct link)ఉందని ఆరోపించారు రాహుల్ గాంధీ. దేశంలో, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు శూన్యం అన్నారు. పార్లమెంట్‌లో (parlament)ఎన్నోసార్లు బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి పనిచేశాయని గుర్తు చేశారు రాహుల్. ఎన్నో సందర్భాల్లో రెండుపార్టీలు ఒక్కటిగా ముందుకెళ్లాయన్నారు. కేసీఆర్‌ ఫోన్‌ చేస్తే మోదీ వెంటనే స్పందిస్తారని, ఎన్నికలు రాగానే బీజేపీ-టీఆర్‌ఎస్‌ డ్రామాలాడతాయని ఫైర్ (fire)అయ్యారు రాహుల్.

ఇక దేశంలో రైతులకు గిట్టుబాటు ధర (Affordable price for farmers)లు లభించడం లేదని, లక్షలాది మంది నిరుద్యోగులు ఫుడ్ డెలివరీ (food delivery) బాయ్స్‌గా పని చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రధాని మోదీ తన స్నేహితులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బ్యాంకుల(bank)నుంచి లక్షల కోట్లు మోదీ తన స్నేహితులకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీ పాలనలో గ్యాస్ (gas) సిలిండర్ ధర రూ. 400 నుంచి రూ. 1100 అయ్యిందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో, పెట్రోల్ (petrol) డీజిల్ (diesel)ధరలు భారీగా పెరిగాయన్నారు. ఓవైపు దోచుకోవడం, మరోవైపు సామాన్యుల నడ్డివిరచడం ప్రధాని నరేంద్ర మోదీకి సర్వసాధారణం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచక పాలనకు వ్యతిరేకంగానే భారత్ జోడో యాత్రను ప్రారంభించానని తెలపిన ఆయన.. దేశ సమైక్యత కోసం ఈ యాత్ర సాగుతుందన్నారు.

అలాగే గుజరాత్ ఎన్నికల్లో (gujarath) కాంగ్రెస్ ప్రభావవంతంగా పోటీ చేస్తుందని, తప్పకుండా విజయం సాధిస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ది అంతా ‘గాలే’నని, క్షేత్రస్థాయిలో దాని ప్రభావం ఏమాత్రమూ లేదని తేల్చి చెప్పారు. ప్రకటనలతోనే అది సంచలనం సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలో రెండు భావజాలల మధ్యే పోరు జరుగుతోందని అన్నారు. అందులో ఒకటి దేశాన్ని విభజించాలని చూస్తుంటే, మరోటి దేశాన్ని ఒక్కటి చేయాలని భావిస్తోందన్నారు. ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందన్నారు. ఆరెస్సెస్, (RSS) బీజేపీ (BJP)భావజాలాన్ని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ సామరస్యంగా పనిచేయాలని రాహుల్ సూచించారు.

(Munugode:రాజగోపాల్ రెడ్డికి చెప్పులు చూపించిన ఓటర్లు..)

దేశవ్యాప్తంగా (across the country) కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం (former glory)తీసుకురావడం కోసం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో పార్టీ శ్రేణులు ఫుల్ జోష్ కనపిస్తున్నారు. ఈ యాత్ర మొత్తం ఆయనతో నడుస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. శంషాబాద్ (SHAMSHABAD)నుండి భారత్ జోడో యాత్ర ప్రారంభమవగా.. కాంగ్రెస్ పార్టీ జెండాలతో, భారీగా కాంగ్రెస్ శ్రేణులతో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగించారు. శంషాబాద్ నుంచి ఆరాంఘర్ (ARAMGHAR)మీదుగా పురానా పూల్ (PURANAPOOL)కు చేరుకున్న యాత్ర.. సాయంత్రం పురానాపూల్ నుంచి చార్మినార్ (Charminar)మీదుగా నెక్లెస్ రోడ్ (Necklace road)కు యాత్ర చేరుకుంది. ఇక ఏడవ రోజు భారత్ జోడో యాత్రలో భాగంగా రాజీవ్ గాంధీ (Rajiv gandhi)సద్భావనా యాత్ర స్మారక స్తంభంపై జాతీయ పతాకాన్ని (National flag)ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (Central University)విద్యార్థి రోహిత్ వేముల (Rohit Vemula) తల్లి రాధిక (Radhika)ముల రాహుల్ ని కలిసి ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి కూడా వచ్చారు. అందులో భాగంగానే రోహిత్ తల్లిని గుర్తించిన రాహుల్ ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకున్నారు. రాహుల్‌తో కలిసి రాధిక పాదయాత్రలో నడిచారు. బీజేపీ, ఆరెస్సెస్ నుంచి మన రాజ్యాంగాన్ని (Constitution)రక్షించాలని ఆమె కోరారు.

Exit mobile version