end
=
Friday, September 20, 2024
సినీమాబన్నీకి బ్రహ్మీ న్యూ ఇయర్ గిఫ్ట్‌..
- Advertisment -

బన్నీకి బ్రహ్మీ న్యూ ఇయర్ గిఫ్ట్‌..

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ బ్రహ్మానందం స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు కొత్త సంవత్సరం సందర్భంగా బ్రహ్మాండమైన బహుమతి అందించారు. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. కోవిడ్‌ సమయంలో విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల బ్రహ్మీ తనలోని చిత్రకారుడిని బయటకు తెచ్చారు. భారతదేశంలో కరోనా కట్టడికి చేసిన లాక్‌డౌన్‌ గురించి తెలియజేస్తూ.. హనుమంతుడిని కౌగిలించుకున్న రాముడు, ఆనంద బాష్పాలు కారుస్తున్న హనుమంతుడు .. ఇలా చాలా బొమ్మలను అద్భుతంగా చిత్రీకరించారు.

తాజాగా కొత్త సంవత్సరం రోజున వెంకటేశ్వరస్వామి బొమ్మను గీసి దాన్ని ఫ్రేమ్‌ చేసి అల్లు అర్జున్‌కు గిఫ్ట్‌గా పంపారు బ్రహ్మీ. ‘బ్రహ్మానందంగారి నుండి అందుకున్న అమూల్యమైన బహుమతి, 45 రోజుల పాటు శ్రమించి ఈ స్కెచ్‌ వేశారు. ఆయనకు నా ధన్యవాదాలు’ అని బ్రహ్మానందంకు బన్నీ థాంక్స్‌ చెప్పారు. కాగా, సినీ రంగంలోకి రాకముందు బ్రహ్మానందం స్కూల్‌లో పాఠాలు చెప్పేవారు. ఆ అనుభవం ఇప్పుడు పనికొచ్చినట్టుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -