end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంతాళికట్టనివ్వని నవ వధువు
- Advertisment -

తాళికట్టనివ్వని నవ వధువు

- Advertisment -
- Advertisment -

యూకో బ్యాంకులో ఉద్యోగాలు

పెళ్లికి ఇరువురు తరపున బంధువులు హాజరయ్యారు. బ్రహ్మాండంగా పెళ్లి వేడుక జరగుతోంది. వేద మంత్రాల మధ్య చక్కని వాతావరణం నెలకొనిఉంది. అందరు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఒక్క నిమిషంలో పెళ్లి తంతు ముగిసే సమయంలో సరిగ్గా వరుడు తాళికట్టబోతుంటే వధువు వద్దని చెప్పింది. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. వరుడు తెల్లమొహం వేశాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ ఘటన తమిళనాడులోని నీలగిరి జిల్లా కోతగిరిలో చోటుచేసుకుంది. వధువు ప్రియదర్శినిని అదే జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహం నిశ్చయించారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, కానిస్టేబుల్‌

ఇరువురి కుటుంబసభ్యులు. వివాహ వేడుకలో వరుడు తాళి కట్టే సమయంలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను ప్రేమించిన వాడు అరగంటలో వస్తాడని చెప్పడంతో వరుడు ఖంగుతిన్నాడు. ఆమె ఏం చెబుతుందో అర్థం కాక చుట్టూ వున్న బంధువుల వైపు చూశాడు. బంధువుల జోక్యం చేసుకుని సర్ది చెప్పబోతే వధువు ససేమిరా అన్నది. ఓ పెద్దావిడ మరికొంత జోక్యం చేసుకుని వధువుని నాలుగు దెబ్బలేసైనా ఒప్పిద్దామనుకుంటే.. వధువు ఆ పెద్దావిడకు ఎదురు తిరిగింది.

దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురబోతోంది: రాజాసింగ్‌

ఈ తంతు కొనసాగుతుండగానే ఎటూ తోచని వరుడు వివాహ వేడుక నుంచి వెళ్ళిపోయాడు. కుటుంసభ్యులు ఎంతగా వారించిన ప్రియదర్శిని మాట వినకపోవడంతో పెళ్లి వద్దంటూ వివాహ వేడుకనుండి వెళ్లిపోయాడు వరుడు. పెళ్లి ఆగిన తరువాత ఎంతసేపటికి ప్రియదర్శిని ప్రేమించిన వ్యక్తి రాకపోవడంతో వధువుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు.

సోనూతో కలిసి దుబాయ్‌కెళ్లిన సంజూ..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -