end
=
Monday, January 20, 2025
వార్తలుజాతీయంపెళ్లి కొడుకుల మార్కెట్
- Advertisment -

పెళ్లి కొడుకుల మార్కెట్

- Advertisment -
- Advertisment -

మనకు కూరగాయల మార్కెట్, పశువుల సంత గురించి తెలుసు విన్నాం చూశాం. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా పెళ్లి కొడుకుల సంత గురించి విన్నారా? ఇక్కడ ఎంతో మంది పెళ్లి కుమారులు ఉంటారు. అమ్మాయిలు వెళ్లి వారిని చూసి నచ్చిన వారిని చేసుకోవచ్చు. ఒక పెళ్లి జరిగి అమ్మాయి, అబ్బాయి ఒక్కటవ్వాలంటే దాని వెనక ఎంతో తతంగం ఉంటుందో మనకి బాగా తెలుసు. ముందుగా పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయిల వివరాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవాలి. ఇంట్లో పెద్దవారు కూడా ఒప్పుకోవాలి. ఆస్తిపాస్తులు, కట్నకానుకలు, ఆడపడుచు కత్నాలు ఇలా చాలానే ఉంటాయి. ఇప్పుడైతే ఎన్నో మాట్రిమోనిలు కూడా వచ్చాయి. ఇప్పడు చాలా పెళ్లిళ్లు ఇలానే జరుగుతున్నాయి. ఐతే బిహార్‌లో ఓ విచిత్రమైన ప్రాంతం ఉంది. అక్కడ పెళ్లి కుమారుల సంత జరుగుతుంది. పెళ్లీడు కొచ్చిన అబ్బాయిలంతా ఈ మేళాలో పాల్గొంటారు. అమ్మాయిలు కూడా వచ్చి అబ్బాయిలందరినీ చూస్తారు. వారిలో తమకు నచ్చిన వాడిని ఎంపిక చేసుకుంటారు. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో అక్కడ ఉంది.

బిహార్‌లోని మధుబని జిల్లా సౌరత్ గ్రామంలో పెళ్లి కొడుకులను అమ్మకానికి పెట్టే మార్కెట్ ఉంది. అక్కడ తొమ్మిది రోజుల పాటు పెళ్లి కొడుకుల సంత జరుగుతుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి తమకు అనువైన నచ్చిన అబ్బాయిలను ఎంచుకోవచ్చు. ఒకరకంగా ఇది ఆఫ్ లైన్ మ్యాట్రిమోని అనుకోవచ్చు. పెళ్లి వయసుకు వచ్చిన యువకులంతా పెళ్లి దుస్తులు ధరించి గ్రామంలోని ఓ చెట్టు కింద ఒక వరుస లో కూర్చుంటారు. వధువు తల్లిదండ్రులు తమ ఆడపిల్లలతో కలిసి అక్కడికి చేరుకుంటారు. పెళ్లి కుమారులందరినీ చూసిన తర్వాత తమకు ఇష్టమైన వారిని ఎంపిక చేసుకోవచ్చు. మిగతా విషయాలను పెద్దలు మాట్లాడుకుంటారు. తర్వాత సౌరథ్ సభ అని పిలిచే ఈ మార్కెట్‌కు మైథిల్ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన కుటుంబీకులే ఎక్కువగా వస్తుంటారు. ఎంతో సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం వస్తోందని ఇప్పటికే తాము పాటిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఒకటి రెండు కాదు. ఏకంగా 700సంవత్సరాల నుండి వారు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. కర్ణాత్ వంశ పాలకుల కాలంలో ఈ ఆచారం ఉన్నట్టు చెబుతారు. వేర్వేరు గోత్రాల మధ్య పెళ్లిళ్లను ప్రోత్సహించేలా రాజా హరి సింగ్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టారట. సౌరథ్ సభ ద్వారా వరకట్న సమస్యలు కూడా తొలగిపోతాయని అనుకున్నారు. కానీ ఆ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. అన్ని చోట్లా ఉన్నట్లుగానే ఇక్కడ కూడా వరకట్నం ఇస్తారు. రూ.50వేల నుంచి లక్షల వరకు ఉంటుంది. సభా వేదికగా కట్నకానులను మాట్లాడుకుంటారు. అన్నీ కుదిరితే పెళ్లి పనులు ప్రారంభించి వివాహం జరిపిస్తారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -