వరంగల్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఎల్కతుర్తి(Elkaturthi meeting)లో ఆదివారం అట్టహాసంగా బీఆర్ ఎస్ రజోత్సవ వేడుకలు (Brs silver jubilee)జరుగనున్నాయి. సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. గులాబీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేశాయి. సభలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Party chief Kalvakuntla Chandra sekhara rao) ఏం మాట్లాడతారా? గులాబీ శ్రేణులకు ఏం సందేశం ఇస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేస్తారా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.
బీఆర్ ఎస్‌కు భారీగా జనం తరలిరావాలని శుక్రవారం ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సిద్దిపేటలో 25 మీటర్ల గులాబీ జెండా ప్రదర్శనతో నిర్వహించారు. `కదం కదం తొక్కుతూ వరంగల్లు సభకు యువత పాదయాత్ర, బీఆర్ఎస్ రజతోత్సవం.. తెలంగాణ ప్రజల విజయోత్సవం.. నాడు లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి రామ దండు కదిలింది. నేడు రేవంతు అరాచకాలు ఎదిరించడానికి గులాబీ దండు కదిలింది` అంటూ హరీశ్‌రావు సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.