- భార్యే హత్య చేయించినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ
గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని అతిదారుణంగా, కిరాతకంగా హత్యచేసి కాల్వలో పడేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సత్యనారాయణ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం మృతదేహం కనిపించకుండా ఉండేందుకు దగ్గరలోని కాలువలో పడేశారు. శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే, భార్యనే సత్యనారాయణను హత్య చేయించిందని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి….
- కరోనాతో నాయిని అహల్య మృతి
- మోదీ సింగిల్ ఫోటో ఫ్లెక్సీలు.. అసహనంలో జేడీయూ
- అత్తారింట్లో సందడి చేసిన బాహుబలి స్టార్..
- సెంచరీతో చెలరేగిన స్టోక్స్.. RR ఘనవిజయం
- బరువు తగ్గాలనుకుంటున్నారా…?