end

మనస్థాపంతో బిటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్‌ బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాధకర సంఘటన గుంటూరు నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూజువీడు మండలం సూరేపల్లికి చెందిన యునీలా ఆర్‌విఆర్‌జేసీ కళాశాలలో బిటెక్‌ రెండవ సంవత్సరం చదువుతోంది. అయితే తన ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం సర్టిఫికెట్లు తన స్నేహితురాలి వద్ద ఉంచింది. తిరిగి అడిగితే సర్టిఫికేట్లు లేవు అని చెప్పడంతో తీవ్ర మనస్థాపానాకి గురైన యునీలా కొరిటెపాడులోని కిలారు టవర్స్‌ ప్రైవేటు హాస్టల్‌ భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version