end

హైదరాబాద్‌లో పెట్టుబడులకు ‘బు అబ్దుల్లా’ కంపెనీ రెడీ..!

  • టీ కన్సల్ట్‌ తొలి అడుగు విజయవంతం

  • టీ హబ్‌లో ఒప్పందం కుదుర్చుకున బు అబ్దుల్లా, టీ కన్సల్ట్‌

  • టీజీఐపీలో చేరిన మొదటి ప్రతిష్టాత్మకమైన కంపెనీగా రికార్డు

  • దుబాయిలో బు అబ్దుల్లాతో సందీప్‌ కుమార్‌ మక్తాలా చర్చలు విజయవంతం

  • టీజీఐపీలో మొదటి ఇన్వెస్టర్‌గా దుబాయ్‌ ఇన్వెస్టర్‌ బు అబ్దుల్లా గ్రూప్‌

  • గ్లోబల్‌ ఇన్వెస్టర్లతో సంబంధాల బలోపేతానికి ఊతం

  • టీ కన్సల్ట్‌తో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్న బు అబ్దుల్లా

 

(Dubai UAE) దుబాయి, యూఏఈ : టీ కన్సల్ట్‌ చారిత్రాత్మకమైన అడుగు వేసింది. ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా నిలిచేందుకు ఏర్పాటైన టీ కన్సల్ట్‌ అనతికాలంలోనే (Hyderabad) హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిష్టాత్మకమైన కంపెనీ బు అబ్దుల్లా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీని ఆహ్వానించింది.ఈ మేరకు టీ హబ్‌లో మంగళవారం ఇరువురు అంగీకార ఒప్పంద పత్రాలపై (signs) సంతకాలు చేసి భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌లో పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు బు అబ్దుల్లా అంగీకారం తెలిపారు. కాగా, మరో 30 స్టార్టప్స్‌తో టీ కన్సల్ట్‌ జాయింట్‌ వెంచర్‌ ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఇటీవలసందీప్‌ కుమార్‌ బృందం దుబాయిలోని బర్జ్‌ ఖలిఫాలో బు అబ్దుల్లాతో సమావేశమయ్యిన విషయం తెలిసిందే.

ఈ సమావేశంలో టీ కన్సల్ట్‌ పనితీరును సందీప్‌ కుమార్‌ మాక్తాల బు అబ్దుల్లాకు వివరించారు. దీంతో ఆయన టీ కన్సెల్ట్‌తో కార్యకలాపాలు సాగించేందుకు అంగీకారం తెలిపారు. దీంతో టీ కన్సల్ట్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌(టీజీఐపీ)పూల్‌తో కలిసి (Globel) పనిచేసేందుకు బు అబ్దుల్లా కంపెనీ ముందుకొచ్చింది. దీంతో మొట్టమొదటి ఇన్వెస్ట్‌మెంట్‌ ఏజెన్సీగా బు అబ్దుల్లా కంపెనీ అవతరించింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 270కుపైగా ‘బు అబ్దులా’్ల కంపెనీలు విస్తరించి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు సాధించి వ్యాపార దిగ్గజాలతో సైతం ఆయన ప్రశంసలు అందుకున్నారు. అట్లాంటి వ్యక్తి టీ కన్సల్ట్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు రావడంపై టీ కన్సల్ట్‌ చైర్మన్‌ సందీప్‌ కుమార్‌ మక్తాలా సంతోషం వ్యక్తం చేశారు.

 

ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార విస్తరణ, వ్యూహాత్మక వ్యాపార సహకారం, వేగవంతమైన వృద్ధికి అత్యున్నత అంతర్జాతీయ పెట్టుబడుదారులతో అనుసంధానమయ్యేందుకు టీ కన్సల్ట్‌ వారధిగా నిలుస్తుందని సందీప్‌ మక్తాలా అన్నారు. బు అబ్దుల్లా గ్రూప్‌తో భాగస్వామ్యం అవడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. ఈ ఒప్పందం మున్ముందు మరింత వ్యాపార వృద్ధికి కీలకంగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం బు అబ్దుల్లా మాట్లాడుతూ.. టీజీఐపీలో చేరడం గొప్పగా ఉందని చెప్పారు. వ్యాపారాలకు మద్ధతు ఇవ్వడం, ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి ఈ ఒప్పందం క్రియాశీలకంగా ఉంటుందని వివరించారు. అనేక కొంగొత్త అవకాశాలు ఏర్పాటవుతాయని తెలిపారు.

Exit mobile version