ప్రదోషం అంటే దోషాల(Errors)ను తొలగించేది అని అర్థం. ప్రతి రోజూ సూర్యాస్తమయ(Sunset) కాలంలో దాదాపు ఆరు ఘడియల (రెండు గంటల 24 నిమిషాల) సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. ప్రదోష కాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని మహా ప్రదోషం అంటారు. మహా ప్రదోషం రోజున శివ భక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు.భాద్రపద మాసంలో మొదటి ప్రదోష వ్రతం ఆగస్టు 24న జరుపుకోనున్నారు. ఇది బుధవారం వస్తుంది కాబట్టి దీనిని బుధ ప్రదోష వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి.హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణమాసన్ని(Sravana Masam) మహిళలంతా ప్రీతికరమైనది భావిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో భక్తులు శివుని భక్తితో ఆరాధిస్తారు.
శ్రావణమాసంలో విష్ణు పూజలు(Worship of Vishnu) చేయడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా శ్రావణమాసం లో చాలామంది ప్రదోష వ్రతం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో కష్టాలు తొలగిపోయి శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈ మాసం అంతా శివుని భక్తితో పూజిస్తే అన్ని శుభ పరిణామాలు జరుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్రతం శ్రావణమాసంలో చేసుకుంటారు.
మహిళలు పెద్ద ఎత్తున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. రాత్రి వేళలో ఉపవాస పూజలు చేయాలని ఈ ప్రదోష వ్రతం అంటారు. ఈరోజు శివునికి(Lord Shiva) ప్రీతికరమైనది.శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడు బుధ ప్రదోష వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ప్రతి నెల త్రయోదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం పాటిస్తూ శివుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలో రెండవ ప్రదోష వ్రతం జరుపుకోనున్నారు.ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి.ఈ వ్రతాన్ని ఆచరించే వారు మహాదేవుడిని పూజిస్తారు. దీనిని జరుపుకోవడం వల్ల వ్యాధులు, గ్రహ దోషాలు(Planetary Doshas), పాపాల నుండి విముక్తి లభిస్తుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. శివుని అనుగ్రహం వల్ల మీ జీవితం బాగా ఉంటుంది.
శివపూజ:
ప్రదోష వ్రతం రోజున సాయంత్రం వేళల్లో శివుని పూజిస్తారు. జనపనార, బిల్వ పత్రాలు, మందార పుష్పాలు, దాతుర, శమీ ఆకులు, అక్షత, చందనం, గంగాజలం, ఆవు పాలు మొదలైనవి ఆయనకు నైవేద్యంగా(As an offering) పెడతారు. ఆరాధన సమయంలో మీరు బుద్ధ ప్రదోష వ్రత కథ వినాలి లేదా చదవాలి. దీంతో వ్రతానికి సంబంధించిన పూర్తి ఫలం లభిస్తుంది.