end
=
Thursday, January 23, 2025
వార్తలురాష్ట్రీయంపవన్‌కల్యాణ్‌కు బంపరాఫర్‌..
- Advertisment -

పవన్‌కల్యాణ్‌కు బంపరాఫర్‌..

- Advertisment -
- Advertisment -

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్‌ కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్‌ పదవి ఇప్పిస్తానని ప్రకటించారు. దొండపాడులో వంగవీటి రంగా విగ్రహాన్ని వీహెచ్‌ ఆవిష్కరించారు. వంగవీటి రంగా రానున్న రోజుల్లో సీఎం అవుతాడనే హత్య చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 3 శాతం ఉన్న సామాజికవర్గం వారు కాంగ్రెస్‌ను నాశనం చేశారని దుయ్యబట్టారు. బీసీలకు పీసీసీ చీఫ్‌ ఇవ్వాలన్నందుకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు. పార్టీ కోసం ప్రాణం పోయినా ఫరవాలేదన్నారు.

దళితుడిని సీఎం చేస్తానని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని వీహెచ్‌ చెప్పారు. ఏపీలో 27 శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారు. వంగవీటి రంగా తర్వాత పవన్‌కల్యాణ్‌కు మంచి వేవ్ ఉందని హనుమంతరావు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -