end
=
Saturday, January 18, 2025
క్రీడలుCricket:సూర్యకు బంపర్ ప్రమోషన్!
- Advertisment -

Cricket:సూర్యకు బంపర్ ప్రమోషన్!

- Advertisment -
- Advertisment -

  • గ్రేడ్ సీ నుంచి బీకి పంపే యోచనలో బీసీసీఐ
  • వార్షిక వేతనం రూ.కోటి నుంచి రూ.3కోట్లకు పెరిగే చాన్స్
  • రహానే, ఇషాంత్ శర్మకు డిమోషన్
  • 21న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌


ఈ నెల 21న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(BCCI) అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. చైర్మన్ రోజర్ బిన్నీ(Roger Binny) నేతృత్వంలో వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ మీటింగ్‌లో భారత క్రికెట్‌కు సంబంధించి ఎజెండాలోని 12 పాయింట్లపై చర్చించనున్నారు. వీటిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రక్టుల అంశం ఒకటి. ఆటగాళ్ల వార్షిక వేతనాలకు సంబంధించిన ఈ కాంట్రాక్టుల్లో పలువురు ప్లేయర్లకు ప్రమోషన్లు(Promotions) ఇవ్వాలని నిర్ణయించగా, కొందరికి డిమోషన్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం, టెస్టు స్పెషలిస్టులు (Test Specialist)అజింక్యా రహానే, ఇషాంత్ శర్మను వార్షిక సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తొలగించనుంది. మరోవైపు, సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌, శుభమన్ గిల్‌‌తోపాటు టీ20 కెప్టెన్‌(T20 Captain)గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యాకూ ప్రమోషన్ ఇవ్వనుంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల విభాగంలో ప్రస్తుతం గ్రేడ్ ఏలో ఉన్న హార్దిక్‌.. టీ20 జట్టుకు ఫుల్ టైం కెప్టెన్‌(Full Time Captain)గా బాధ్యతలు అందుకోనున్న నేపథ్యంలో అతను గ్రేడ్ ఏ+కి వెళ్లే అవకాశం ఉంది. గ్రేడ్ ఏలో ఉన్న రహానే, స్పీడ్‌స్టర్ ఇషాంత్‌తోపాటు గ్రేడ్ బీలో ఉన్న వృద్ధిమాన్ సాహాకు డిమోషన్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది.

‘ఏ+’ లోకి కేఎల్ రాహుల్‌ !
‘‘సూర్య గ్రేడ్ సీ(Grade C)లో ఉన్నాడు. ఏడాదిగా అతను కనబరుస్తున్న ప్రదర్శనతో గ్రేడ్ ఏలోకి కాకపోయినా కనీసం గ్రేడ్ బీలోకైనా ప్రమోషన్ పొందుతాడు. టీ20 ర్యాంకింగ్స్‌(T20 Rankings)లో నం.1 స్థానంలో ఉన్న సూర్య.. వన్డేల్లోనూ పోటీలో ఉన్నాడు’’ అని బీసీసీఐకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు, యువ ఓపెనర్ శుభమన్ గిల్ సైతం సీ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్‌లోకి ప్రమోషన్ పొందనున్నాడు. బంగ్లాతో వన్డేలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ వార్షిక కాంట్రాక్టుల జాబితాలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. వీరేకాకుండా, ఓపెనర్ కేఎల్ రాహుల్ ఏ+ గ్రేడ్‌కు దూసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. రోహిత్ లేనప్పుడు వన్డే కెప్టెన్‌గా ఎక్కువగా రాహులే(Rahul) బాధ్యతలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

(Cricket:సిరీస్ ఇంగ్లాండ్‌దే)

ప్రస్తుత బీసీసీఐ కాంట్రాక్టులు(Current BCCI Contracts)
ఏ+ గ్రేడ్(రూ.7కోట్లు) : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా

ఏ గ్రేడ్ (రూ. 5కోట్లు): అశ్విన్, జడేజా, పుజారా, రహానే, ధావన్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా

బీ గ్రేడ్ (రూ. 3కోట్లు): వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ థాకూర్, మయాంక్ అగర్వాల్

గ్రేడ్ సీ (రూ. కోటి): కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, శుభమన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, భువీ, సూర్యకుమార్

అపెక్స్ మీటింగ్ ఎజెండాలోని ఇతర ముఖ్యాంశాలు

  • టీ20, వన్డే జట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించడంపై చర్చ(టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి హార్దిక్‌ను నియమించే అవకాశం).
  • టీ20 జట్టుకు ప్రత్యేక కోచ్‌ను(Special Coach) నియమించడం.
  • టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు వైఫల్యంపై సమీక్ష.
  • సెలక్షన్ కమిటీ రొటేషన్ పాలసీ(Rotation Policy)పై చర్చ.
  • టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్లయిన బైజూస్, ఎంపీఎల్‌ల స్టేటస్‌పై సమీక్ష.
  • భారత్ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లకు వేదికల ఎంపిక.
  • ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ఫిజియో టీమ్‌తోపాటు భారత జట్టు సపోర్టింగ్ స్టాఫ్‌పై బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. కావున, ఆయా విభాగాల్లో మార్పులపై చర్చ.
  • ఇటీవల ఆటగాళ్లు తరచూ గాయాల పాలవుతుండటంతో ఇంజ్యూరీ మేనేజ్‌మెంట్‌(Injury Management)పై సమీక్ష.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -