తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసి మరోసారి షాక్ ఇచ్చింది. బస్ ఛార్జీలు పెంచుతున్నట్లు శుక్రవారం తెలంగాణ ఆర్టీసి ప్రకటించింది. పెరిగిన ఇంధన ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసి వర్గాలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డీజిల్ సెస్ విధించామని ఆర్టీసి ఎండి వీసీ సజ్జనార్, చైర్మన్ గోవర్ధన్ తెలిపారు. ప్రజలు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని వారు కోరారు.
పల్లెవెలుగు, సిటీ, ఆర్డినరీ సర్వీసులకు డీజిల్ సెస్ కింద రూ.2, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఎసీ బస్ సర్వీలకు రూ.5 చొప్పున పెంచుతున్నట్లు ఎండి సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే బస్ సర్వీసుల్లో కనీస టికెట్ ధరను రూ.10గా నిర్ణయించారు. కాగా బస్ ఛార్జీలు శనివారం నుండి అమల్లోకి వస్తాయని తెలిపారు.