end

Women’s freedom: స్త్రీ స్వేచ్ఛ కోసం మేల్ రైట్స్ విస్మరించవచ్చా?

  • మహిళా ఆందోళనలకే ప్రాధాన్యతివ్వాలన్న ఢిల్లీ హైకోర్టు
  • వైవాహిక వివాదాల కేసులో భార్య వైపే మొగ్గు
  • ఈక్వల్ రైట్స్ వినియోగించే స్వేచ్ఛతోనే లింగ సమానత్వం
  • అదనపు సాయాల కన్నా స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం

మహిళలు న్యాయం (Women justice) పొందేందుకు మనదేశం చాలా హక్కులను (Rights)కల్పిస్తోంది. కానీ ఆ హక్కులను వినియోగించుకునే స్వేచ్ఛ (freedom)లేదన్నది నిర్వివాదాంశం. చాలా మంది స్త్రీలకు తమ హక్కుల గురించి తెలియదు. మరికొందరు నియంతృత సమాజం కారణంగా ముందుకు అడుగేయలేరు. కాబట్టి ప్రభుత్వం (government)మహిళలకు అలవెన్సులు (Allowances)జారీ చేసినప్పుడు, వారి ఆందోళనలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అణచివేయబడకుండా మద్దతు, న్యాయం పొందుతారు. అయితే దీనర్థం పురుషుల (males)ఆందోళనలను కోర్టులు (court)విస్మరించాలని కాదు. ఇది ఎంత మాత్రం ఉమెన్ ఎంపవర్‌మెంట్ (Women Empowerment)లేదా జెండర్ ఈక్వాలిటీ (Gender Equality) వైపుగా వేసే అడుగు కాదు. మరొక అసమాన సమాజాన్ని స్థాపించే దిశగా అడుగు. అణచివేతకు గురైన వారు ఇతరులపై అధికారాన్ని పొందడమొక్కటే కనిపించే వ్యత్యాసం. మరి జెండర్ ఈక్వాలిటీ ఎలా సాధ్యం? పురుషుల హక్కులు కాలరాయకుండా స్త్రీ స్వేచ్ఛ కోసం ఏం చేయాలి?

వైవాహిక (Marital)వివాదాల కేసు (case)బదిలీలో పురుషుల కంటే మహిళల ఆందోళనలు, సౌకర్యాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi)ఇటీవల తీర్పునిచ్చింది. ‘ప్రత్యేకించి మ్యాట్రిమోనియల్ పిటిషన్‌ను (Matrimonial Petition)బదిలీ చేసేటప్పుడు ఇరు పక్షాలకు ఎటువంటి అసౌకర్యం కలగని విధంగా అధికార పరిధిని అమలు చేయాలి. ఇలాంటి విషయాల్లో భార్య సౌలభ్యం ఎక్కువగా చూడాలన్నది స్థిరమైన పద్ధతి. పిటిషనర్-భార్య (wife)అభ్యర్థన వెనుక బరువైన కారణాలు ఉన్నట్లయితే మాత్రమే దానిని తిరస్కరించవచ్చు’ అని తీర్పులో పేర్కొంది. గృహ హింస చట్టం (Domestic Violence Act), 2005లోని సెక్షన్ (section)12, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ (Criminal Procedure Code Sec)125 కింద నమోదైన తన భరణం కేసును ప్రిన్సిపల్ జడ్జి, ఫ్యామిలీ కోర్ట్, (Principal Judge, Family Court) ద్వారక నుంచి ప్రిన్సిపల్ జడ్జి, ఫ్యామిలీ కోర్టు, కర్కర్డూమాకు బదిలీ చేయాలని కోరిన 68 ఏళ్ల వృద్ధురాలి పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు ఈ తీర్పు వెలువడింది. అయితే 72 ఏళ్ల భర్త మాత్రం తన భార్య.. మెయింటెనెన్స్‌లోని అన్ని ప్రయోజనాలను అనుభవిస్తోందని, కేసు బదిలీకి ప్రయత్నించడం తనను వేధించే ప్రయత్నమని పేర్కొన్నాడు. అయితే, సదరు మహిళ కేసు బదిలీని నిరాకరించేందుకు ఎటువంటి కారణం కనుగొనని కోర్టు అందుకు అనుమతించింది.

(Onion:ఉల్లితో గుండెకు ప్రమాదమే..)

కోర్టుల పక్షపాతం సరైనదేనా?

కేసు పూర్తి వివరాలతో పాటు దంపతుల (couple) మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ కోర్టులు (court) ఇప్పుడు మహిళా సమస్యలను పరిగణలోకి తీసుకుంటున్నాయని, వాటిని పరిష్కరిస్తున్నాయని ఈ కేసు ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ ఒక పక్షపాతం దాగుంది. కోర్టు మహిళలకు అనుకూలంగా ఉన్నప్పటికీ, పురుషుల అణచివేతను పణంగా పెట్టి అలా చేయడం సరైనదేనా? పురుషులకు సంబంధించిన కేసులను విచారిస్తున్నప్పుడు కోర్టులు మహిళల పట్ల పక్షపాతంగా వ్యవహరించడం సరైనదేనా? స్త్రీలు అణగారిన వర్గం కాబట్టి స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వడానికి పురుషుల హక్కులను తీసివేయాలా? లింగ సమానత్వాన్ని సాధించేందుకు స్త్రీలకు అనుకూలంగా రూల్స్ (rules)ఎందుకు మార్చాలి?

ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడమే : స్త్రీపురుషులిద్దరికీ సమాన హక్కులు కల్పించడంతో పాటు వాటిని వినియోగించుకునేందుకు సమాన స్వేచ్ఛను అందించడమే లింగ సమానత్వం. ఇది ప్రతి జెండర్‌కు లైఫ్(life), స్వేచ్ఛ (freedom)మధ్య సమతుల్యతను కొనసాగించడం. ఇది ఇతరులను అణచివేసే ఖర్చుతో అణగారిన వారికి అధికారం ఇవ్వడం కాదు. అయితే మహిళలు తమను తాము శక్తివంతం చేసుకునేందుకు సొసైటీ మద్దతు అవసరమనేది వాస్తవమే. అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పడానికి సంకోచించకుండా వారికి మద్దతు, సత్వర న్యాయం అందించాల్సిందే. ముఖ్యంగా వైవాహిక వివాదాల్లో మహిళలు చాలా సందర్భాల్లో అణచివేతకు గురవుతున్నారు. వారికి ఆర్థిక స్వాతంత్ర్యం (Financial independence) లేకపోవడమే తమ వాయిస్ (voice)బలంగా వినిపించడం, కేసులపై పోరాడటంలో ప్రధాన అడ్డంకిగా మారుతుంది. వివాహాన్ని ప్రశ్నించడానికి, గర్వంగా బయటకు వెళ్లడానికి వారికి సామాజిక మద్దతు (Social support)కూడా లేదు.

(Brass and Copper vessels: ఇత్తడి, రాగి పాత్రల్లో వంట మంచిదేనా..?)

Exit mobile version