end

నిన్నటి పూలను బయటపారేయొచ్చా?

పూజా ప్రారంభంలో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటాం. క్రిందటి రోజున దైవాలను అర్చించిన పువ్వులు వగైరా తొలగిస్తాం. వాటినే నిర్మాల్యం అంటారు. ఈ నిర్మాల్యాన్ని ఎవరూ తొక్కకూడదు. చెరువు నీటిలో లేదా పారేనీటిలో వేయడం శ్రేయస్కరం. చెరువు, ఏరు లేని ప్రాంతాల్లో ఈ నిర్మాల్యాన్ని మొక్కల్లో వేయడం మంచిది. గొయ్యి తీసి పూడ్చి పెట్టడం మరో పద్ధతి. ఎవరూ తొక్కని చోట అనే నియమాన్ని పాటిస్తూ ఎలా చేసినా పరవాలేదు.

గుమ్మడి, కలబందలను వాకిలివద్దగానీ, ఇంట్లోగానీ వేలాడదీయడం వల్ల ప్రయోజనాలేంటి?

బూడిద గుమ్మడికాయను దిష్టి పోవడం కోసం, దుష్టశక్తులు ఇంటిలోకి ప్రవేశించకుండా ఉండడం కోసం వాకిలివద్ద కట్టుకుంటారు. కొందరు బ్రహ్మజెముడు, కలబందలను కూడా వాకిలి వద్ద వేలాడదీస్తారు. బ్రహ్మజెముడు చిన్న ముక్కను, పటిక వంటి వాటిని ఇంటిలోనికి దుష్టశక్తులు రాకుండా ఉండాలని కోరుతూ గుమ్మం బయట కడతారు. కలబంద ఇంటిలో ఎక్కడైనా ఉండవచ్చు. అద్భుతమైన ఔషధగుణాలున్న కలబంద అదృష్టం తెచ్చిపెడుతుందని భావిస్తారు. ఆరోగ్యం పొందడం అన్నింటికంటే గొప్ప అదృష్టం.

సేకరణః చొల్లేటి మహేందర్‌రెడ్డి

Exit mobile version