end
=
Sunday, January 19, 2025
క్రీడలువర్కౌట్స్‌లో కెప్టెన్ కోహ్లి..
- Advertisment -

వర్కౌట్స్‌లో కెప్టెన్ కోహ్లి..

- Advertisment -
- Advertisment -

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యతనిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన జనరేషన్‌లో కోహ్లి మిగితా ఆటగాళ్లకు రోల్‌మోడల్‌. ఎప్పుడూ నెట్‌ ప్రాక్టీస్‌, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే కోహ్లి.. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో త్వరలో భారత్‌ లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ ఆడనున్న విషయం తెలిసిందే. కాగా, కోహ్లి.. ప్రస్తుతం జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆసీస్‌ సిరీస్‌లో గెలుపే లక్ష్యంగా సన్నద్దమవుతున్నాడు. బరువులెత్తడంతో సహా ట్రేడ్‌మిల్‌, కార్డియో ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నాడు.

ఆసీస్‌ సిరీస్‌లో భారత్‌.. మూడు టీ20లు, మూడు వన్డేలు, 4 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌ ఈనెల 27 నుంచి మొదలౌతుంది. కాగా, కెప్టెన్‌ కోహ్లి లిమిటెడ్ ఓవర్లకు పూర్తిగా అందుబాటులో ఉంటాడు. కానీ, టెస్టుల్లో మాత్రం తన పూర్తి స్థాయి సేవలు అందించలేకపోతున్నాడు. తొలి టెస్టు అనంతరం, కోహ్లి భారత్‌ రానున్నాడు. తన భార్య అనుష్కా శర్మ డెలివెరీ డేట్‌ జనవరిలో ఉండడంతో ఆయన భార్య పక్కన ఉండాలని నిర్ణయించుకున్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -