end

జాతి వివక్ష వ్యాఖ్యలపై కెప్టెన్‌ విరాట్ ఆగ్రహం

భారత ఆటగాళ్లపై ఆస్ట్రేలియా అభిమానులు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఈ ఘటనపై ఆయన ఆస్ట్రేలియా అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాత్యంహంకార వ్యాఖ్యలు ఏ మాత్రం సహించరానివని, బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేసే ఆటగాళ్లకు ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి అని విరాట్‌ అన్నాడు. టీమిండియా ఆటగాళ్లపై ఆస్ట్రేలియా ప్రేక్షకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని విరాట్‌ అభిప్రాయపడ్డాడు. ఇది అసలుసిసలైన రౌడీయిజానికి నిదర్శనంగా కనిపిస్తోందన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, విరాట్‌ ప్రస్తుతం ఇండియాలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల సెలవుపై ఇండియాకు తిరిగొచ్చారు. ఆయన స్థానంలో అజింక్య రహానే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Exit mobile version