end
=
Sunday, November 24, 2024
వార్తలురాష్ట్రీయంబీజేపీ ఎంపీపై కేసు నమోదు
- Advertisment -

బీజేపీ ఎంపీపై కేసు నమోదు

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనకు సంబంధించి ఆయనపై 504, 506, 427 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ అరవింద్‌తో పాటు కార్యకర్తలపైనా కేసు నమోదు అయింది.

కాగా, బీజేపీ కార్పోరేటర్ అభ్యర్థి విజయదుర్గ సందీప్‌ యాదవ్‌కు మద్దతుగా ఆయన నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో ఉంటూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజల మధ్య ఉంటేనే నాయకుడు అంటారని, ఫాంహౌస్‌లో ఉండేవాడిని ఏమంటారని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారాయన. కరీంనగర్‌, నిజామాబాద్‌, దుబ్బాక ఎన్నికల్లో ఎలా నిజాయితీకి ఓటు వేశారో అలానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓటువేసి మార్పుకు శ్రీకారం చుడదామని ఈ సందర్భంగా ఎంపీ అరవింద్‌ ఓటర్లను కోరారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -