end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంజాతీయ మెగా లోక్అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి
- Advertisment -

జాతీయ మెగా లోక్అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి

- Advertisment -
- Advertisment -
  • మెదక్‌ జిల్లా ఎస్పీ చందనాదీప్తి

ఈ నెల 12వ తేదీన జరుగనున్న జాతీయ మెగా లోక్అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జాతీయ మెగా లోక్అదాలత్ ఉన్నందున రాజీ అవాకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని జిల్లా కోర్ట్ కానిస్టేబుళ్లను ఎస్పీ ఆదేశించారు. నేషనల్ లోక్ అదాలత్ కేసులో కాంప్రమైజ్అ య్యేటట్లు ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వోలు ఛాలెంజ్‌గా తీసుకొని కేసుల్లో ఉన్న ఇరువర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ని ర్వహించాలని సూచించారు. మెగా లోక్ అదాలత్ లో సాధ్యమైనంత వరకూ ఎక్కువ కేసులు పరిష్కారం చేయించాలన్నారు. రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాల వారిని పిలిపించి చిన్నచిన్న కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఒకే గ్రామంలో ఉండే వారు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారని రాజీయే రాజమార్గమని వారికి అర్థమయ్యే విధంగా తెలపాలని సూచించారు. లిస్ట్ అవుట్ చేసిన కేసులలో అన్ని కేసులు రాజీ పడేటట్లు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎస్పీ తెలిపారు.

పెండింగ్ ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు. రాజీ కేసుల పైన త్వరలో డిజిపి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రైమ్ రివ్యూ తీసుకోవడం జరుగుతుందన్నారు. యుఐ కేసులను తగ్గించడం టార్గెట్ గా పెట్టుకోవాలని తెలిపారు. పెండింగ్ ఉన్న సిసి నెంబర్లు వెంటనే తీసుకోవాలని సూచించారు. జ్యుడీషియల్ అధికారులతో లైజనింగ్ ఏర్పరచుకొని విధులు నిర్వహించాలని సూచించారు. లోక్ అదాలత్ లో సాధ్యమైనంతవరకు ఎక్కువ మొత్తంలో కేసులు డిస్పోజల్ పోయేటట్లు చూడాలని తెలిపారు. సమన్స్‌, వారెంట్స్ కేసులలో కోర్టులో జరిగే ప్రాసెస్ ప్రతిరోజు డాటా సిసిసిటియన్ఎస్లో ఎంట్రీ చేయాలని సూచించారు. నాలుగు రకాలుగా కేసులను డిస్పోజల్ చేయవచ్చునని, లోక్ అదాలత్ లో కాంప్రమైజ్, పెండింగ్ ఉన్న సిసి నెంబర్లు తీసుకోవడం, కేసులలో అడ్మిషన్ చేయడం, పోలీస్ డిస్పోజల్ ఈ నాలుగు టార్గెట్‌గా పెట్టుకుని యుఐ కేసులు తగ్గించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్లో ఫంక్షనల్ వర్టికల్ విధులు నిర్వహించే సిబ్బంది సి సి టి ఎం ఎస్ డాటా ఎంట్రీ యొక్క ఫర్ఫార్మెన్స్ ను బట్టి డీజీపీ ప్రతి నెల రాష్ట్రస్థాయిలో అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అప్రిసియేషన్ సర్టిఫికెట్ పొందే విధంగా విధులు నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్లాలని నేరస్తులకు పోక్సో, మర్డర్, రేప్ మరియు ఇతర గ్రీన్ కేసులలో నేరస్తులకు శిక్షలు పడేలా సాక్షులకు బ్రీఫింగ్ ఇవ్వాలని సూచించారు. కోర్టు విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి కేసులలో శిక్షల శాతం పెంచాలని సూచించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -