సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య: 115
పోస్టుల వివరాలు: ఎకనమిస్ట్–01, ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్–01, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–01, డేటా సైంటిస్ట్–01, క్రెడిట్ ఆఫీసర్లు–10, డేటా ఇంజనీర్లు–11, ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్–01, ఐటీ ఎస్‌ఓసీ అనలిస్ట్–02, రిస్క్ మేనేజర్లు–05, టెక్నికల్ ఆఫీసర్లు(క్రెడిట్)–05, ఫైనాన్షియల్ అనలిస్ట్–20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–15, లా ఆఫీసర్లు–20, రిస్క్ మేనేజర్లు–10, సెక్యూరిటీ–12.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ, సీఏ/సీఎఫ్‌ఏ/ఏసీఎంఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 20–45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
పరీక్షా విధానం: రాతపరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 23.11.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.12.2021
వెబ్‌సైట్: https://www.centralbankofindia.co.in