end

ఆరోగ్యంగా కేంద్ర మంత్రి అమిత్‌షా

  • ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి నుండి డిశ్చార్జి

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆయనకు ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో ఆయన ఇంటికి వెళ్లారు. కానీ కొద్ది రోజులకే తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు రావడంతో మళ్లీ అమిత్‌షా ఆగస్టు 18న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. అయితే ఇప్పుడు అయన పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారు. సోమవారం ఉదయం అమిత్‌షా డిశ్చార్జి అయ్యారు.

Exit mobile version