కరోనా మహమ్మారికి దేశంలోని ప్రముఖులు, పోలీసులు, రాజకీయ నాయకులు బలవుతున్నారు. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి ఈరోజు(బుధవారం) కరోనా సోకి చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో మృతి చెందారు. దీంతో కేంద్ర రాజకీయ వర్గాలు చాలా దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సురేష్‌కు రెండు వారాల క్రితం అనగా సెప్టెంబర్ 11న ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించుకొని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.
అయితే చికిత్స పొందుతూ ఆయన బుధవారం మృతి చెందారు. అయితే మంత్రి సురేష్ బెలగావి లోక్‌సభ నుండి బీజెపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలో కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందిన మొట్ట మొదటి కేంద్ర మంత్రి సురేష్ కావడం బీజెపీ వర్గాల్లో, ఆయన అభిమానుల్లో చాలా ఆందోళన కలిగిస్తోంది.