end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంనిరుద్యోగులకు కేంద్రం తీపి కబురు
- Advertisment -

నిరుద్యోగులకు కేంద్రం తీపి కబురు

- Advertisment -
- Advertisment -

ఉపాధి కోల్పోయినవారికి మూడు నెలలు సగం జీతం

వెబ్‌డెస్కు : కరోనా వైరస్ మహమ్మారి ప్రజల ప్రాణాలే కాదు, వారి జీవన ప్రమాణాలను హరిస్తోంది. వైరస్ నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ వల్ల లక్షలాది మంది ఉపాధిలేక వీధిన పడ్డారు. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆదుకోవడానికి కేంద్రం ముందుకొచ్చింది. మూడు నెలల పాటు వారి సగటు వేతనంలో 50శాతాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ నేతృత్వంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసీ  బోర్డు గురువారం సాయంత్రం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈఎస్ఐసీలో ఇప్పటికే సభ్యులుగా ఉన్న కార్మికులు తాజా ఆర్థిక సాయం పొందడానికి అర్హులు.

దేశద్రోహం… పాకిస్తాన్‌ మిలిటరీకి కీలక సమాచారం

కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 41 లక్షల మంది కార్మికులకు దీని వల్ల లబ్ధి చేకూరనుంది. లాక్‌డౌన్ సమయంలో మార్చి 24 నుంచి ఉపాధి కోల్పోయిన, డిసెంబరు 31 వరకు ఉపాధి కోల్పోయే వారికి ఈ పథకం వర్తిస్తుంది. అయితే, 2018 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఈఎస్ఐసీ పథకంలో చేరి కనీసం రెండేళ్లు అయి ఉండాలి. 2019 అక్టోబర్ 1 నుంచి 2020 మార్చి 31 మధ్య కాలంలో కనీసం 78 రోజులు జమ చేసినవారు అర్హులు.

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -