end
=
Sunday, January 19, 2025
క్రీడలుఓ ఇంటివాడయిన మిస్టరీ స్పిన్నర్‌
- Advertisment -

ఓ ఇంటివాడయిన మిస్టరీ స్పిన్నర్‌

- Advertisment -
- Advertisment -

న్యూఢిల్లీ: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. పాపులర్ యూట్యూబర్, మోడల్‌ ధనశ్రీ వర్మను చాహల్‌ పెళ్లాడాడు. గురుగ్రామ్‌లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల మధ్య జరిగింది. తమ వివాహ ఫొటోలను చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఆ వెంటనే అతడి స్నేహితుడు పీయూష్ సచ్‌దేవ్ కూడా పెళ్లి ఫొటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

కాగా, ధనశ్రీతో తనకు నిశ్చితార్థం అయినట్టు ఆగస్టులో ప్రకటించిన చాహల్.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొరియోగ్రాఫర్, డాక్టర్ అయిన ధనశ్రీ యూట్యూబర్ కూడా. చాహల్‌తోపాటు ధనశ్రీ కూడా ఆగస్టులో తమ ‘రోకా’ ఉత్సవానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -