end
=
Saturday, January 18, 2025
సినీమాట్విట్టర్‌లో రికార్డు సృష్టించిన చరణ్‌..
- Advertisment -

ట్విట్టర్‌లో రికార్డు సృష్టించిన చరణ్‌..

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్‌ హీరో, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సోషల్‌ మీడియాలో కొత్త రికార్డు సృష్టించారు. ట్విట్టర్‌ ఖాతా ప్రారంభించిన అతి తక్కువ కాలంలో ఒక మిలియన్‌ (పది లక్షలు) ఫాలోయర్స్‌ను సొంతం చేసుకున్నారు చరణ్‌. అంతకు ముందు ఈ మగధీరుడు సోషల్‌ మీడియాలో ఉన్నప్పటికీ మధ్యలో గ్యాప్‌ తీసుకున్నారు. అయితే ఈ ఏడాది మార్చిలో చరణ్‌ మళ్లీ ట్విట్టర్లోకి అడుగుపెట్టారు. కేవలం 233 రోజుల్లోనే పది లక్షల ఫాలోయర్లను ఆయన సొంతం చేసుకోవడం విశేషం. తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు చరణ్‌.

తమ అభిమాన హీరో పదిలక్షల మార్కును చేరుకోవడంతో మెగా అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్‌చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌)సినిమాలో నటిస్తున్నారు. భారీ మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ మూవీలో చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్నారు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారని టాలీవుడ్ సమాచారం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -