మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రణబ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, తెలంగాణ గవర్నర్ సౌందర రాజన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ సేవలు అజరామరం అని కొనియాడారు. ఐదు దశాబ్ధాల పాటు దేశానికి ఎంతో సేవ అందినారని ప్రశంసించారు. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్ దేశానికి ఎంతో సేవలు చేశారని పలువురు రాజకీయ వేత్తలు ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
- Advertisment -
మాజీ రాష్ర్టపతికి తెలుగు రాష్ర్టల సీఎంల సంతాపం..
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -