- రాణించిన సామ్‌కర్రన్
- అదరగొట్టిన ముంబై బౌలర్లు
షార్జా వేదికగా ముంబై, చెన్నై జట్ల మధ్య జరుగుతున్న రెండో లీగ్‌దశ మ్యాచ్‌లో చెన్నై స్వల్ప స్కోరుకే మరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి114 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌ను ముంబై బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఖాతా తెరవకముందే.. బౌల్ట్ ఎల్బీగా వెనక్కి పంపాడు.
ముంబై ముందు చెన్నై నిలుస్తుందా..
అనంతరం క్రీజులోకి వచ్చిన రాయుడిని.. జట్టు స్కోరు 3 పరుగుల వద్ద ఉండగానే బుమ్రా బొల్తా కొట్టించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ జగదీశన్‌ను బుమ్రా డకౌట్గా వెనక్కి పంపాడు. జట్టు స్కోరు 3పై ఉండగానే మరో బ్యాట్స్‌మెన్ డూప్లెసీని బౌల్ట్ ఔట్ చేశాడు. దీంతో 3 పరుగుల వద్దే చెన్నై 4 వికెట్లు కోల్పోయింది.ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధోని, జడేజా కాస్త భాద్యతాయుత బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన జడేజాను కృనాల్ ఔట్ చేశాడు.
టీఆఎర్‌ఎస్ ఎంపి రాములుకు కరోనా పాజిటివ్
21 పరుగులకే 5 వికెట్లు, 30 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన చెన్నైని సామ్ కర్రన్(47 బంతుల్లో, 52 పరుగులు; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్బుతంగా రాణించి, జట్టు స్కోరును 100 దాటించాడు. అతడికి తాహిర్ చక్కటి సహకారమందించాడు. మంచి టచ్‌లోకి వచ్చిన కెప్టెన్ ధోని(16 పరుగుల) వద్ద రాహుల్ చాహర్ ఔట్ చేశాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు, బుమ్రా, రాహుల్ చాహర్ తలో రెండు వికెట్లు, కౌల్టర్ నైల్1వికెట్ పడగొట్టాడు.