end
=
Sunday, January 19, 2025
క్రీడలుభారత జట్టు సెలక్షన్ ప్యానెల్ చైర్మన్‌గా చేతన్‌
- Advertisment -

భారత జట్టు సెలక్షన్ ప్యానెల్ చైర్మన్‌గా చేతన్‌

- Advertisment -
- Advertisment -

అహ్మదాబాద్: టీమిండియా మాజీ పేసర్ చేతన్ శర్మను సీనియర్ నేషనల్ సెలక్షన్ ప్యానెల్ చైర్మన్‌గా నియమిస్తూ బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యుల జట్టులో అబే కురువిల్లా, దేవాశిష్ మొహంతిలను కూడా చేర్చింది. నిన్న అహ్మదాబాద్‌లో జరిగిన బీసీసీఐ 89వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సెలక్షన్ ప్యానెల్‌లో టీమండియా మాజీ ఆటగాళ్లు సునీల్ జోషి, హర్విందర్ సింగ్ కూడా ఉన్నారు.

కాగా, చేతన్ శర్మ భారత్‌ తరపున 23 టెస్టులు, 65 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 11 ఏళ్లపాటు సాగిన అతడి అంతర్జాతీయ కెరియర్‌లో 1987 ప్రపంచకప్‌లో తీసిన హ్యాట్రిక్ ఒక చెరగని గుర్తు. చేతన్ శర్మ 16 ఏళ్ల వయసులోనే హర్యానా తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 18 ఏళ్ల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అంతకంటే ఏడాది ముందు అంటే డిసెంబరు 1983లో విండీస్‌తో జరిగినే మ్యాచ్‌తో వన్డేలో అడుగుపెట్టాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -