end

Christmas:క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్

ఈనెల 21న హైదరాబాద్ ఎల్బీస్టేడియం(LB Stadium) లో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల్లో(Christmas celebrations) పాల్గొనాలని ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్ కార్డినల్ పూల అంటోని(Archbishop of Hyderabad Cardinal Pula Antony), మెదక్ చర్చి బిషప్ పద్మారావు గారిని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఆహ్వానించారు.సికింద్రాబాద్ లోని మిలీనియం చర్చి హౌస్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Ishwar) గారు వెళ్లి స్వయంగా కార్డినల్ పూల అంటోని గారికి ఆహ్వానపత్రిక అందజేసి శాలువాతో సత్కరించి,అనంతరం సి.ఎస్.ఎస్.ఐ.టి లో మెదక్ చర్చ్(Medak Church) బిషప్ గారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు కలిశారు.

క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) గారితో సహా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆహ్వాన పత్రిక అందజేసేందుకు వెళ్లిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు క్రిస్టియన్ పెద్దలు ఘన స్వాగత పలికారు.ఈ కార్యక్రమంలో ఫాదర్ ఇమ్మానియేల్ ,విక్టర్, ఇన్నారెడ్డి,తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, శంకర్ లూక్, మైనారిటీ కార్పొరేషన్ ఎండి క్రాంతి వెస్లీ, విద్యా స్రవంతి, రాయడన్ రోస్, భాస్కర్ అయ్యా, కుమార్, ఓరుగంటి ఆనంద్, ఆరేపల్లి రాజేందర్,
అజిత్ భాను కిరణ్ తో పాటు పలు చర్చిల ఫాదర్లు, క్రైస్తవ పెద్దలు(Christian elders) పాల్గొన్నారు.

Exit mobile version