- బాలుడిని కాపాడబోయి పెద్దమ్మ కూడా మృత్యువాత
మూడు రోజులపాటు మళ్లీ భారీ వర్షాలు !
భారీ వర్షాలకు రాష్ర్టంలోని అన్ని చెరువులు, కుంటలు, వాగులు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. ఈ సందర్భంగానే కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యాం నిండింది. అయితే మానేరు ప్రాజెక్టులను చూసేందుకు చాలా మంది ప్రజలు విహారానికి తరలివస్తున్నారు. మానేరు అందాలను తిలకించేందుకు వెళ్లి మానేరు డ్యాంలో గల్లంతై ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది.
బస్సులో మంటలు … తప్పిన ప్రమాదం
పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్‌లోని కశ్మీర్‌గడ్డకు చెందిన సఖీనా (35), తన చెల్లెలి కొడుకు అహాల్(2)తో కలిసి అల్గునూర్‌లోని మానేరు ఒడ్డున ఉన్న దర్గా వద్దకు వెళ్లారు. అలాగే ఎల్ఎండీ గేట్ల ద్వారా వదిలిన నీటి ప్రవాహాన్ని చూసేందుకు పిల్లలతో కలిసి వెళ్లింది. కాగా, బాబు నీటిలో పడినట్లు గమనించిన సఖీన రక్షించేందుకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకు పోయింది. అహాల్ కొన ఊపిరితో ఉన్న బాబును ఎల్ఎండీ ఎస్ఐ కృష్ణారెడ్డి స్వయంగా దవాఖానకు తరలించగా బాబు కూడా మృతి చెందాడు.