end
=
Wednesday, July 3, 2024
వార్తలుజాతీయంఢిల్లీలో ఘోరం... ఎర్రటి ఎండలో చిన్నారి
- Advertisment -

ఢిల్లీలో ఘోరం… ఎర్రటి ఎండలో చిన్నారి

- Advertisment -
- Advertisment -

చిన్నారి హోం వర్క్‌ చేయలేదని మిట్ట మధ్యాహ్నం ఎండలో కాళ్లు చేతులు కట్టిపడేసిన సంఘటన సోషల్‌ మీడియాలో వైరస్‌ అయింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ హృదయవిదారక దృశ్యం చుట్టుపక్కల వారిని కలవరపెట్టింది. ఢిల్లీలోని ఖజూరీ ఖాస్‌ ప్రాంతంలో ఓ మహిళ తన ఐదేళ్ల చిన్నారి హోం వర్క్‌ చేయలేదని మిట్ట మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎర్రటి ఎండలో డాబాపై కాళ్లు చేతులు కట్టేసి పడేసింది. ఆ చిన్నారి పెడుతున్న కేకలు చుట్టు పక్కల వారిని కలిచివేసింది. దీంతో వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఢిల్లీ పోలీస్‌ రాకేష్‌, మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలీవాల్‌కు ట్యాగ్‌ చేశారు. బాధ్యులపై సత్వం చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో పలువరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -