end

నియంత్రణ రేఖ వద్ద డ్రాగన్‌ దూకుడు

భారత్‌-చైనా సరిహద్ధు ప్రాంతం లడఖ్‌లో డ్రాగన్‌ దేశం భారత్‌ సైన్యం కదలికలను ఆరా తీస్తోంది. గల్వాన్‌ లోయలో దొంగదెబ్బతీసిన చైనాకు భారత్‌ మిలిటరీ ధీటుగా బదులిచ్చింది. అయినాసరే చైనా తన పంథాను మార్చుకోవడం లేదు. భారత సైన్యం సెంట్రల్‌ సెక్టార్‌ కదలికలపై డ్రాగన్‌ సైన్యం కన్నెసిందని నిఘా వర్గాల తెలిసింది.

సైనికుల తిరుగుబాటు… మాలి దేశాధ్యక్షుడు రాజీనామా

ఉత్తరాఖండ్‌ చమోలి జిల్లాలోని భారత్‌ సరిహద్దుల్లో బారహోటి ప్రాంతం వరకూ తన నిఘా వ్యవస్ధను చైనా విస్తరించినట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఇదేగాకుండా నియంత్రణ రేఖ పోడవునా కొత్త నిఘా పరికాలను అమర్చిందని తెలుస్తోంది. 180 డిగ్రీలు తిరగే రెండు కెమరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పలు స్తంభాలను చైనా ఏర్పాటు చేసిందని, ఇక్కడే భారీ సోలార్‌ ప్యానెల్‌ను, విండ్‌మిల్‌ను నిర్మించిందని నిఘా వర్గాల నివేదిక వెల్లడించింది.

వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్‌ ఇంజనీరింగ్‌ అవార్డు

ఈ ప్రాంతంలో చిన్న పక్కా ఇంటిని నిర్మించి అందులో నిర్మాణ సామాగ్రిని, నిఘా పరికరాలను చైనా ఉంచిందని పేర్కొంది. బారహోతి ప్రాంతంలో భారత సేనల కదలికలను పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ పసిగట్టేలా కెమెరాలను అమర్చిందని వెల్లడించారు.

క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

Exit mobile version