end
=
Friday, November 22, 2024
వార్తలుఅంతర్జాతీయం3 కోట్లు దాటిన కోవిడ్ కేసులు
- Advertisment -

3 కోట్లు దాటిన కోవిడ్ కేసులు

- Advertisment -
- Advertisment -

  • ఎఫ్‌బి-7 దాడితో విలవిలలాడుతున్న చైనా
  • ఈ వారంలోనే అన్ని రికార్డులూ బద్దలు

Covid ; చైనా (China) వాసులను ప్రస్తుతం ప్రకృతి బీభత్సం కోవిడ్ వైరస్ (Covid Vovid) రూపంలో వణికిస్తోంది. సైలెంట్ కిల్లర్‌గా చడి చప్పుడు లేకుండా ముంచుకొచ్చిన బిఎఫ్-7 (BF- 7)రకం కరోనా వైరస్ చైనా నగరాలను ముంచెత్తుతోంది. రోజురోజుకూ అంచనాలకు మించి చైనాలో పెరుగుతున్న వైరస్ కేసులు ప్రపంచాన్నే కలవరపెడుతున్నాయి.

బ్లూంబెర్గ్‌ (Bloomberg)లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం ఈ వారంలో ఒక రోజులోనే చైనాలో 3 కోట్ల 70 లక్షల మంది వైరస్ బారిన పడనున్నారని తెలుస్తోంది. ఇది ప్రపంచ వైరస్ కేసులు రికార్డులన్నింటిని బద్దలు చేయనుందని భావిస్తున్నారు. చైనా ప్రభుత్వ అత్యున్నత అథారిటీ ఇచ్చిన సమాచారం ప్రాతికదికన ఈ అంచనాను విడుదల చేశారు. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (China National Health Commission) అంతర్గత బేటీ మినిట్స్ నుంచి ఈ లెక్కలను తవ్వితీయడం గమనార్హం. డిసెంబర్ 20న ఒక్కరోజులోనే చైనాలో 3.7 కోట్ల కేసులు నమోదయ్యాయని ఈ నివేదిక సమాచారం. చైనా అధికారిక కేసుల సంఖ్యతో పోలిస్తే ఈ నివేదిక తెలిపిన కేసులు అన్ని రికార్డులను బద్దలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అధికారక లెక్కల ప్రకారం ఆ రోజున చైనాలో 3,049 వైరస్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2022 జనవరిలో ఒకే రోజు 40 లక్షల వైరస్ కేసులు నమోదు కావడం అతిపెద్ద రికార్డుగా ఉండేది. డిసెంబర్ (December) తొలి 20 రోజుల్లోనే చైనాలో 2 కోట్ల 80 లక్షలమంది వైరస్ బారిన పడ్డట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

నిరంతర లాక్‌డౌన్‌ని (lock down) నిరసిస్తూ చైనా ప్రజల తీవ్ర నిరసనల నేపధ్యంలో షీ జిన్‌పింగ్ (Xi Jinping)నేతృత్వంలోని చైనా ప్రభుత్వం ఈ నెల మొదట్లో జీరో కోవిడ్ పాలసీ (Zero Covid Policy)ని ఎత్తివేసింది. అప్పటినుంచి బీఎఫ్-7 కొత్త వైరస్ రకం చైనా నగరాలను ముంచెత్తిందని చెబుతున్నారు. చైనాకు సంబంధించిన పలు సోషల్ మీడియా వేదికలు దేశంలో కిటకిటలాడుతున్న ఆసుపత్రుల వీడియోలను పోస్ట్ చేస్తుండటంతో అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటోందో వెలుగులోకి వస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే చైనాలో రాబోయే నెలల్లో లక్షలాది మంది కోవిడ్-19 బారిన పడి మరణించే ప్రమాదం ఉందని సాంక్రమిక వ్యాధుల నిపుణులు హెచ్చరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -