గత కొన్ని రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా సైన్యం దూకుడుకు భారత రక్షణ శాఖ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో వేటకు వెళ్లిన 5 మందిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు అపహరించారు. సుబన్‌సిరి జిల్లా నాచో ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ఇద్దరు వ్యక్తులు తప్పించుకొని వచ్చి పోలీసులు ఫిర్యాదు చేశారు. అలాగే ఇండియన్ ఆర్మీ అధికారులను కూడా కలిశారు.
స్థానిక ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ఈ దుర్ఘటనపై భారత ప్రధాన మంత్రి ఆఫీసుకు ఫిర్యాదు చేశారు. చైనా బలగాలు ప్రతీసారి కొందరు పౌరులను అపహరిస్తున్నారని, చైనా బలగాలకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన పిఎంఓను కోరుతూ ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటనపై అరుణాచల్‌ప్రదేశ్ పోలీసులు కూడా విచారణ చెపట్టారు.