- 3,500కు పైగా ఉన్నట్లు తెలిపిన కేంద్రం
దేశంలోని మొత్తం 3,560 కంపెనీల్లో చైనాకు చెందిన డైరెక్టర్లు(directors) ఉన్నారని కేంద్రం తెలిపింది. కార్పొరేట్(Corporate) వ్యవహారాల సహాయ మంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, మొత్తం 174 చైనా కంపెనీలు విదేశీ కంపెనీలుగా భారత్‌లో రిజిఎస్టర్ చేసుకున్నాయని చెప్పారు. కార్పొరేట్ డేటా మేనేజ్‌మెంట్ వెబ్‌సైట్ ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్(ఎంసీఏ) డేటా విడిగా లేనందున ఏ కంపెనీలో ఎంతమంది చైనా భాగస్వాములు లేదా పెట్టుబడిదారులు ఉన్నారనే విషయాలు చెప్పలేకపోతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం(Central Govt) భారత కంపెనీల బోర్డులలో డైరెక్టర్ల నియామకాలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం, ఇకమీదట చైనా(China)తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు కంపెనీ బోర్డులో చేరేందుకు భద్రతా పరమైన అనుమతులు తీసుకోవడం తప్పనిసరిగా ఉంది. దీని కోసం ప్రభుత్వం 2013 కంపెనీల చట్టంలో డైరెక్టర్ల అర్హత, నియామకాల నిబంధనల్లో మార్పులు చేయనుంది.