end
=
Monday, January 20, 2025
సినీమావిశ్వనాథ్‌ను కలిసిన చిరంజీవి దంపతులు
- Advertisment -

విశ్వనాథ్‌ను కలిసిన చిరంజీవి దంపతులు

- Advertisment -
- Advertisment -

కళతపస్విగా పేరుగాంచిన దిగ్గజ దర్శకులు విశ్వనాథ్‌ను మెగాస్టార్‌ చిరంజీవి.. సతీసమేతంగా స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. విశ్వనాథ్‌ దంపతులకు చిరు దంపతులు నూతన వస్త్రాలు అందజేశారు. చిరంజీవి అంటే మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించగలరని, ఎలాంటి పాత్రకైనా వన్నె తీసుకురాగల ప్రతిభ ఆయన సొంతమని వీరి కలయికలో వచ్చిన సినిమాలు నిరూపించాయి. కాగా దీపావళి పండుగను పురస్కరించుకుని గురువుగారిని కలిసిన చిరంజీవి, వారి మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘విశ్వనాథ్ గారిని క‌ల‌వాల‌నిపించింది. అందుకే ఈ రోజు ఆయ‌న ఇంటికి వచ్చాను. ఆయ‌న నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారు. దీపావళి వేళ ఆయ‌నను క‌ల‌వ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. అంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్షలు’ అన్నారు. కాగా, చిరు.. విశ్వనాథ్‌ కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఆ సినిమాలు- శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాందవుడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -