end
=
Sunday, January 19, 2025
సినీమాచిరు సర్‌ నన్ను కొట్టడానికి ఇబ్బంది పడ్డారు
- Advertisment -

చిరు సర్‌ నన్ను కొట్టడానికి ఇబ్బంది పడ్డారు

- Advertisment -
- Advertisment -

మెగాస్టార్‌ చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌, నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ మూవీలో ఇండియన్‌ స్టార్‌ యాక్టర్‌ సోనూసూద్‌ విలన్‌ క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక తాను విలన్‌ పాత్రలు చేయనంటున్నాడు సోనూ. అందుకు కారణం మెగాస్టార్‌ చిరంజీవేనట.

తను అలా ఎందుకు చెప్పాడు. ఏం జరిగింది? అనే వివరాల్లోకెళ్తే.. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్‌లో సోనూసూద్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ “చిరంజీవి సర్‌.. ఆచార్య సినిమా యాక్షన్‌ సన్నివేశంలో నన్ను కొట్టడానికి ఇబ్బంది పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. కోవిడ్‌ సమయంలో ఎంతో మందికి సేవ చేసి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నావు. నిన్ను కొడితే ప్రేక్షకులు నాపై కోపం పెంచుకుంటారు” అని అన్నారు.

చిరు సర్‌పై అభిమానంతో తాను ఇకపై విలన్‌గా సినిమాలు చేయనని, హీరోగా నటిస్తానని సోనూసూద్‌ తెలిపారు. తన దగ్గర ఇప్పటికే నాలుగు స్క్రిప్ట్స్‌ ఉన్నాయని, కొత్త సంవత్సరాన్ని కొత్తగా ఆరంభిద్దామనుకుంటున్నానని కూడా తెలిపారు సోనూసూద్‌. సినీ ఇండస్ట్రీలో యాక్టర్‌గా, లైఫ్‌లో రియల్‌ హీరోగా సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌ లీడ్‌ చేసిన సోనూ.. హీరోగానూ రాణించాలని ఆశిద్దాం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -