మోర్గాన్ ఫ్రీమ్యాన్ అనే ప్రముఖ హాలీవుడ్ నటుడు నటన గురించి చెప్పిన మాటలివి… `నటుడు అనేవాడు ఆ పాత్రలో జీవించాలి. ఆ క్యారెక్టర్ అంచుల్ని తాకాలి. తనను తాను జయించాలి. అప్పుడే అతను కొత్తగా పుడతాడు`. సినిమా అనే ఒక కళారూపం(Artistic way) జీవం పోసుకున్న తొలినాళ్ళలో నటులు మాత్రమే అలాంటి నటులు(Versatile Peformers) ఉండేవారు. వాళ్ళు అద్భుతంగా జీవించారు. అందుకే ఇప్పటికీ వాళ్ళను మనం ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం. ఆ తరువాత తరాల్లో నటులు కనుమరుగై కేవలం హీరోలు మాత్రమే మిగులుతూ వస్తున్నారు. అడపాదడపా నటులు పుట్టినా వాళ్ళల్లో ప్రత్యేకత అంటూ ఏమీలేదు. కానీ ఒక నటుడు, ఒకే ఒక్క నటుడు మాత్రం చాలా ప్రత్యేకం. అతనే కెన్నీ అలియాస్ చియాన్ విక్రమ్(Chiyan Vikram). చియాన్, అపరిచితుడు, పితామమగన్ చిత్రాలతో తనెంటో చిత్రపరిశ్రమ(Film Industry)కు చాటి చెప్పాడు. ఆకలి మీద ఉన్నవాడికి పంచభక్ష్య పరమాన్నం దొరికినట్టు విక్రమ్ ఆ చిత్రాలకు కుదిరాడు. ముఖ్యంగా `అపరిచితుడు` చిత్రంలో ఆయన పోషించిన మూడు పాత్రలు న భూతో న భవిష్యత్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్ర ఆయనకు దొరికింది. నటుడు ఒకేసారి మూడు పాత్రల్ని మార్చి మార్చి నటించడం ఆరోజుల్లో నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. రామం – రెమో – అపరిచితుడు పాత్రలు ఆంగికం లోనూ, ఆహార్యం లోనూ ఒకదానికి ఒకటి పోలికలే లే ఉండవు. మూడేళ్ల క్రితం విడుదలై `మహాన్` చిత్రంలోనూ విక్రమ్ అదే తరహా నటన ప్రదర్శించాడు. తాజాగా బహుళ భాషల్లో విడుదలైన `ధీర వీర శూర` చిత్రం బోల్తా కొట్టినప్పటికీ.. మున్ముందు మళ్లీ ఆయన స్క్రీన్ తినేసే పాత్రాలు రాక మానవు. ఏది ఏమైనా గురువారం విక్రమ్ జన్మదినం సందర్భంగా `విశ్వటాకీస్`, `తెలుగు 24` తరఫున ఆయనకు హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.
– విశ్వటాకీస్
90309 38479