end

ఆప్కో మాజీ చైర్మన్‌ ఇంటిపై సీఐడీ దాడులు

  • 2.9 కిలోల బంగారం, 1.8 కిలోల వెండి, రూ.కోటి నగదు సీజ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట ఆప్కో మాజీ చైర్మన్‌ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడి అధికారులు సోదాలు చేశారు. కడప జిల్లా ఖాజీపేట మండల కేంద్రంలోని ఆయన ఇంట్లో సిఐడి డీఎస్సీ సుబ్బరాజు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి 2.9 కిలోల బంగారం, 1.8 కిలోల వెండి, రూ.1 కోటి వరకు నగదు, విలువైన ఆస్తుల ప్రతాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 20 మందికి పైగా సిఐడి అధికారులు ఈ సోదాలలో పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆప్కోలో జరిగిన అక్రమాలకు సంబంధించి మంగళగిరి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే కోర్టు అనుమతి తీసుకొని సిఐడి బృందం శ్రీనివాసులు ఇంటిని సోదా చేశారు. ఇదిలావుండగా ప్రోద్దుటూరులోని ఆయన బంధువులు, అనుచరుల ఇండ్లలలో కూడా సోదాలు నిర్వహించి విలువైన పత్రాలు సీజ్‌ చేసినట్లు సీఐడి డీఎస్సీ సుబ్బరాజు తెలిపారు. ఈ దాడులలో తిరుపతి సీఐడి అధికారులు గిరిబాబు, రామకృష్ణ, భాస్కర్‌నాయక్‌, అశోక్‌కుమార్‌, శ్రీనివాసులు ఉన్నారు.

Exit mobile version