ఈ నెల 7వ తారీఖు నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారభమవనున్నాయి. ఈ విషయాన్ని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) కన్వీనర్ లింబాద్రి ధృవీకరించారు. కరోనా కారణంగా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు కలగకుండా ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని వారు సూచించారు. దోస్త్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్లో 27,365 సీట్లు కేటాయించినట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి పేర్కొన్నారు.