end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంChandrababu Naidu:సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ద్రోహి
- Advertisment -

Chandrababu Naidu:సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ద్రోహి

- Advertisment -
- Advertisment -

  • టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు ఫైర్
  • ప్రాణాలైన ఇస్తా కానీ రాష్ట్రాన్ని నాశనం కానివ్వను
  • ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికార వైసీపీ (YCP)ప్రభుత్వంపై సంచన వ్యాఖ్యలు చేశారు. ‘2024 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఎవరికీ ఉండదని, మళ్లీ ముఖ్యమంత్రిగానే (CM) సభకు వెళతానన్నారు. మంగళగిరిలోని (Mangalagiri) టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనకు రాజకీయాలు కొత్తేమీ కాదని, ప్రపంచ స్థాయలో గౌరవం పొందిన పార్టీ టీడీపీ’ అని అన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలవకపోతే, నేతలు సిద్దంగా లేకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. తప్పు జరుగుతున్నప్పుడు నేతలు తొడకొట్టి బదులివ్వాలి. అప్పుడే అరాచకాలను నిలువరించవచ్చు. జగన్ (Jagan) అన్ని వ్యవస్థలను నాశనం చేయడం ద్వారా అడ్డులేకుండా చూసుకుంటున్నాడు’ అని చంద్రబాబు ఆరోపించాడు. అలాగే తెలుగుదేశం జాతీయ భావాలతో పని చేసిన పార్టీ అని. దేశంలో అనేక సంస్కరణల్లో టీడీపీ భాగస్వామిగా ఉంది. దిక్సూచిగా పనిచేసింది అని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉన్నామో ప్రతి పక్షంలోనూ అంతే బాధ్యతగా ఉండి సేవ చేస్తున్నట్లు తెలిపారు. 

ఇలాంటి నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు

నా రాజకీయ జీవితంలో వైఎస్ జగన్ లాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ‘1978లో నేను మొదటి సారి ఎమ్మెల్యేను (MLA)అయ్యాను. అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను. సంక్షేమం, అభివృద్దికి టీడీపీ ఒక నమూనా. చాలా మంది మఖ్యమంత్రులను చూశా. చాలా మందితో పోరాడాను. 1984లోనే ప్రజాస్వామ్య (Democracy) పరిరక్షణ కోసం ఇందిరా గాంధీకి (Indira gandhi) వ్యతిరేకంగా పోరాడి గెలిచాం. కానీ ఇంత దారుణమైన, నీచమైన ప్రభుత్వం నేను ఎక్కడా చూడలేదు. మూడున్నరేళ్ల క్రితం అచ్చెన్నాయుడుతో (Achchennaidu)మొదలు సోషల్ మీడియా కార్యకర్తల వరకు అందరినీ వేధించారు. కోర్టులకు (Court) వెళ్లి అనేక కేసులపై పోరాడాం. కానీ అక్రమ అరెస్టులు చేసి, పోలీసు టార్చర్ (Police torcher)చేసి కార్యకర్తలను, నేతలను వేధించారు’ అని వెల్లడించాడు.

(Electric bike:ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్‌లు)

తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను వదిలేది లేదు

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలోని కొందరి తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా జీవితంలో పోలీసులు, ప్రభుత్వం ఇలా వ్యవహరించడం చూడలేదు. ఎంపీ రఘురామరాజును (MP Raghuramaraju) ప్రభుత్వం వేధించే విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న వారిలో మార్పు రావడం లేదు. చివరికి పార్టీ కార్యాలయంలో పని చేసే మీడియా కో ఆర్డినేటర్‌ను (Coordinator) కూడా అరెస్టు చేశారు. ఇలా తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై చర్యలు తీసుకునేది ఖాయం. సీఎంకు చెందిన ఒక ఫ్లెక్సీ (Flexi)చినిగితే హంగామా చేసిన పోలీసులు తునిలో భక్తుడి వేషంలో మా నేతపై హత్యాయత్నం చేస్తే పోలీసులు ఎక్కడికి వెళ్లారు.? సిగ్గుందా ఈ పోలీసులకు అని నేను అడుగుతున్నాను. బాధ, ఆవేదన, కసి నాకూ ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యం పద్దతిలో నేను ఆలోచిస్తున్నాను. స్థానిక ఎన్నికల్లో (Elections) అక్రమాలతో గెలిచారు. ఇది చూసి కొవ్వెక్కి వ్యవహరించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. దీంతో మంచి స్పందన వస్తోంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మరోవైపు మహానాడుకు అడ్డంకులు సృష్టించినా ప్రజలు కసితో, ఆవేశంతో వచ్చి విజయవంతం చేశారు. నందిగామలో (Nandigama) పర్యటిస్తుండగా నా మీద రాయి విసిరి భయపెట్టాలి అని ప్రయత్నించారు. పూలల్లో రాళ్లు వచ్చాయని పోలీసులు చెప్పారు. అంటే పూలల్లో బాంబులు కూడా వస్తాయా? కర్నూలు పర్యటన విజయవంతం అయ్యింది. ఆదోనిలో (Adoni) కూడా నాపై రాయివేశారు. కానీ వెనక్కి తగ్గలేదు అని టీడీపీ అధినేత తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్

‘ఒకే రాజధాని (Capital)కి కర్నూలు (Kurnool) ప్రజలు ముక్తకంఠంతో అంగీకారం తెలిపారు. ఒకే రాజధాని కావాలి అని నినదించారు. జగన్ నువ్వు మనిషివి అయితే మారు అని అక్కడే నిలదీశాను. కర్నూలు పర్యటనలో నిరసనలు చెప్పడానికి వచ్చారు. ఊర్లో రౌడీకి భయపడి జనం నోరెత్తరు. ఇప్పుడు అదే విధానంలో జగన్ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ప్రాణాలు అయినా ఇస్తాను గానీ రాష్ట్రాన్ని నాశనం కానివ్వను. అమరావతి రాజధాని (Amaravathi) అని అసెంబ్లీలో (Assembly)బిల్లు పెట్టినప్పుడు ఇదే సీఎం, ఇదే పార్టీ ఒప్పుకున్నారా లేదా? ఆరోజు కర్నూలులో హైకోర్టు (Hi court) కావాలి అని జగన్ అడగలేదు. మా నేత ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. అమరావతే రాజధాని అని వైసీపీ నేతలు ఎన్నికల్లో చెప్పలేదా? కర్నూలును మెగా సిటీ (Mega city)చేస్తాం అన్నాం. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం అని స్పష్టంగా చెప్పాం. రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి, ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్’ అని ఆరోపించారు.

పోరాటానికి నేతలు సన్నద్ధం కావాలి

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి అని స్పష్టం చేశారు. ‘ప్రజలు పోరాటానికి సిద్దంగా ఉన్నారు. నేతలు సిద్దం కావాల్సిన సమయం ఇది. కేసుల నుంచి జగన్ తప్పించుకోలేడు అని సుప్రీం కోర్టు (Supreme court)చెప్పింది. తప్పు చేసిన జగన్ ఎప్పటికైనా శిక్ష నుంచి తప్పించుకోలేడు. బాదుడే బాదుడుతో ప్రజలను చైతన్య పరిచాం. సీఎం ఎలా రాష్ట్ర స్థాయిలో దోచుకుంటున్నాడో ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా దోచుకుంటున్నారు. ప్రజల భూములు (Lands), క్వారీలు (Quarries), వ్యాపారులను దోచుకుంటున్నారు. ఏంటి ఈ అన్యాయం అని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి నాపైనా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. 

‘రాష్ట్రంలో వ్యవసాయ శాఖను (Department of Agriculture) మూత వేశారు. కర్నూలులో పత్తి విత్తనాల కల్తీతో ( adulteration)) రైతులు (Farmers) తీవ్రంగా నష్టపోయారు. టమాటా (Tomato) కేజీ ఒక్క రూపాయికి అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పరిస్థితులు దిగజారడంతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతు బిడ్డలకు, కూలీల బిడ్డలకు టీడీపీ ఐటి ఉద్యోగాలు (Jobs) ఇస్తే వైసీపీ వారి జీవితాలు నాశనం చేసింది. రాష్ట్రంలో ఇరిగేషన్‌ను (Irrigation) పూర్తిగా నాశనం చేశారు. పోలవరాన్ని (Polavaram) నిలిపివేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా నిలిపివేశారు. విద్య, ఆరోగ్య రంగాలను సైతం ఈ ముఖ్యమంత్రి నాశనం చేశారు. 4 లక్షల మంది విద్యార్థులు (Student) స్కూళ్లకు (Schools) దూరమయ్యారు. మనం తెచ్చిన విట్, ఎస్‌ఆర్‌ఎం (Witt, SRM)వంటి సంస్థలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించడం లేదు. ఎయిమ్స్‌కు (AIMS)కనీసం నీళ్లు ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ (Tribal University)ని ఇంకా ప్రారంభించలేదని, పేదవాళ్లకు ఇంటిపేరుతో కూడా ఈ ప్రభుత్వం రూ.6 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని  అని ఎద్దేవా చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -