end

CM Jagan:అలీ కూతురి పెళ్లికి సీఎం జగన్‌ భారీ కానుక..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ర్ట ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (Electronic Media Advisor to State Govt)గా అలీ (ali)ని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అలీ దంపతులు (couples) సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపగా.. సినీ నటుడు అలీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడుస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వీడియో (video) విడుదల చేసిన ఆయన.. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించినందుకు సీఎం జగన్‌ (CM Jagan)కి కృతజ్ఞతలు తెలిపారు. 2019 ఎన్నికల్లో (elections)రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించానని, అలాగే పార్టీ అప్పగించిన పనులను నిబద్ధతతో పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం తాను చేసిన సేవలను సీఎం జగన్ గుర్తించారని చెప్పుకొచ్చారు. తమ కుటుంబం (family)సీఎం జగన్‌తో భేటీ అయినప్పుడు గుడ్ న్యూస్ (good news) చెప్తానని హామీ ఇచ్చారని ఆ హామీని ఇలా నిలబెట్టుకున్నారని చెప్పుకొచ్చారు.

(Rajapalayam:200 మంది పేద పిల్లలకు షాపింగ్)

అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. త్వరలోనే తన కుమార్తె (daughter)వివాహం (marriage)జరగబోతుందని.. ఈ పదవిని తన కూతురి పెళ్లికి సీఎం జగన్ ఇచ్చిన బహుమతిగా (gift) భావిస్తున్నట్లు సినీనటుడు అలీ తెలిపారు. మరోవైపు అలీ సతీమణి జుబేదా (Jubheda)సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. బంధువులు, (relation)స్నేహితులు (friends)ఇతరులు అంతా తనభర్తకు సీఎం జగన్ ఏం పదవి ఇస్తారని అంతా అడుగుతున్నారని ఇలాంటి తరుణంలో తన భర్తకు పదవి దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు తమ కుటుంబానికి పెద్ద పండుగ రోజు అని ఆమె అన్నారు. ఇకపోతే ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా అలీ ఈ పదవిలో రెండేళ్లు  (2 years)కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరే ఆయనకు కూడా జీతభత్యాలు అందనున్నాయి.

Exit mobile version