end

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ జెండావందనం

74వ స్వాతంత్ర్య దినోతవ్స వేడుకలను శనివారం ప్రగతిభవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే కరోనా దృష్ట్యా అతికొద్ది మంది అధికారులు మాత్రమే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు.

జెండా ఆవిష్కరణ ముగియగానే సీఎం కేసీఆర్‌ సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌కు వెళ్లారు. అక్కడ అమరవీరుల స్తూపానికి పూల మాల వేసి స్వాంతంత్ర్యం కోసం అమరులైన వారికి నివాళ్లర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులున్నారు.

Exit mobile version