end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంRevanth Reddy:సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష
- Advertisment -

Revanth Reddy:సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష

- Advertisment -
- Advertisment -

  • పప్పన్నం తిని, బోనం ఎత్తినందుకే సకల సౌకర్యాలు
  • సంచలన వ్యాఖ్యలతో ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి
  • రేవంత్ ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్


ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha), రేవంత్ మధ్య (Revanth Reddy) ట్వీట్‌వార్‌ (Tweet war). దీక్షా దివస్‌పై వ్యంగ్యంగా ట్వీట్ చేసిన కామెంట్‌కు అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు కవిత. పప్పన్నం తిని, బోనం ఎత్తినందుకే సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని రేవంత్ అంటే.. బోనం ఎత్తిన ఆడపడుచులను అవమానిస్తారా అంటూ ప్రశ్నించారు కవితతెలంగాణ బిడ్డలు చేసిన ప్రతి బలిదానం కాంగ్రెస్ (Congress) చేసిన హత్యేనని ఆరోపించారు MLC కల్వకుంట్ల కవిత. తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టేనని, దీక్షా దీవస్‌ (Deeksha Divas) సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా కవిత ఫైరయ్యారు. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని ట్వీట్ చేశారు కవిత. ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదన్నారు కవిత. తెలంగాణ కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ (KCR), దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణ రాష్ట్రం తెచ్చారు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం అమేథిలో (Amethi) గెలుస్తానన్న నమ్మకం లేకే రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్ (Rahul Gandhi in Wayanad, Kerala) వెళ్లారన్నారు. తానూ ఎంపీగా (MP) ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీకి (MLC) పోటీ చేసి గెలిచానని కవిత స్పష్టం చేశారు.

ఇది దీక్షా దివాస్ కాదు.. దగా దివాస్!..
ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్‌కు, రీ ట్విట్‌ ఘాటుగా ఇచ్చారు పీసీసీ (PCC)అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. ‘ఇది దీక్షా దివాస్ కాదు.. దగా దివాస్! అన్నారు. దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినమన్నారు. దొంగ దీక్ష నాటకమాడిన మీ నాయన సీఎం (CM) కుర్చీ ఎక్కిండన్నారు.చిత్తశుద్దితో ఉద్యమం చేసి, బలిదానాలు చేసిన బిడ్డలకు కనీసం గుర్తింపే లేకపాయిందంటూ రేవంత్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ‘వంటావార్పులో పప్పన్నం తిన్నందుకు.. బతుకమ్మ ఆడినందుకు.. బోనం కుండలు ఎత్తినందుకు.. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తున్నారన్నారు. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల (Srikanto Acharya, Constable Kistaiah, Yadayala) త్యాగాలనేమనాలి!? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు.

పప్పన్నం, బోనం, బతుకమ్మకు పరిమితం సరికాదు..
సీఎం కేసీఆర్‌ చేసిన దీక్షను, దొంగ దీక్ష అనడంతో కవిత అదేస్థాయిలో ఘాటుగా స్పందించారు. చంద్రబాబు (Chandrababu) తొత్తుగా ఉంటూ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహళల (Womens) పాత్రను కేవలం పప్పన్నం, బోనం, బతుకమ్మకు పరిమితం చేస్తూ మాట్లాడడం మహిళల పట్ల మీ పార్టీకి (Party) ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందంటూ రేవంత్‌కు కౌంటరిచ్చారు. మిలియన్ మార్చ్, సాగరహారం, అసెంబ్లీ ముట్టడి ( Million march, sagara haram, Assembly Muttadi) లో మేము ఆడబిడ్డలము ముందున్నాము !! కానీ ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని ఘాటుగా ట్వీట్ ద్వారా బదులిచ్చారు ఎమ్మెల్సీ కవిత.

కవిత ట్వీట్:
‘తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమే కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారు 1/3. తెలంగాణ కోసం జరిగిన ప్రతి బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యే. సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానని నమ్మకం లేక కేరళ రాష్ట్రం వాయనాడ్ వెళ్లారు మీ నాయకుడు రాహుల్ గాంధీ.. ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో మీ పార్టీ పైనే ఎమ్మెల్సీ‌కి పోటీ చేసి గెలిచా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -