end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయం28న సీఎం బహిరంగ సభ..!
- Advertisment -

28న సీఎం బహిరంగ సభ..!

- Advertisment -
- Advertisment -

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి(ఎల్బీ) స్టేడియంలో ఈ సభ జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ బహిరంగా సభ ఉంటుందా..? లేదా అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. కాగా, నగరంలో ఒక్క బహిరంగ సభనైనా నిర్వహించాలని సీఎం ఇదివరకే నిర్ణయించారు. కాగా, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ మరిన్ని ఎక్కువ డివిజన్లు గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. పక్కాగా 108 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఇటీవల పార్టీ ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -