end
=
Saturday, January 18, 2025
వార్తలుజిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
- Advertisment -

జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

- Advertisment -
- Advertisment -
  • సొంత జిల్లా నుంచి పర్యటన మొదలు

  • రేపు మహబూబ్ నగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ : రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. (CM REVANTH REDDY) మంగళవారం (ఈ నెల 9వతేదీన) తన సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నుండి ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అధికారిక కార్యక్రమాలతో పాటు.. పార్టీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

మధ్యానం 12.30 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్న సిఎం. అక్కడ ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,అధికారులతో (REVUE MEETING) సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా గ్రూపు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి క్యాంటిన్ ను ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. అదే సమావేశంలో టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకోనున్నట్టు సమాచారం.సాయంత్రం 5.30గంటల తరువాత తిరిగి హైదరాబాదుకు రానున్న సిఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సోమవారం హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -