end

CM Jagan:రూట్ మార్చిన సీఎం

  • ప్రజలకు చేరువయ్యేందుకు బాధితుల్ని కలుస్తున్న జగన్
  • పార్టీనేతలపై వేటు వేసేందుకు వెనకాడని ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM)జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy)ఇటీవలి కాలంలో విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనాలు, పథకాలకు సంబంధించిన నిధుల విడుదల వంటి కార్యక్రమాల్లో వరుసగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన రూటు మార్చేసినట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో తన పర్యటనల్లో నాటకీయ పరిణామాలు ఎక్కువైపోయాయి. బహిరంగ సభల్లో (Public meeting)విపక్షాలపై విరుచుకుపడటం ఓ ఎత్తైతే అవి ముగియగానే ఆపన్న హస్తం కోసం ఎదురుచూసే బాధితుల్ని అక్కున చేర్చుకోవడం మరో ఎత్తుగా కనిపిస్తోంది. మూడున్నరేళ్లలో ముందు మరో కోణాన్ని ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాయంకోసం వేడుకుంటూ జనం ముఖ్యమంత్రిని ఆశ్రయిస్తున్న దృశ్యాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తుండగా.. మూడేళ్లలో లేనంత ఎక్కువగా ఆయన ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నంచేస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కూడా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు పెద్ద యంత్రాంగాన్నే నిర్వహించేవారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన వినతుల్ని వడపోసి వాటి అర్హతల ఆధారంగా పరిష్కరించే వారు. అప్పట్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిన దరఖాస్తులకు అడిగిన వారికి లేదనకుండా నిధులు విడుదల చేసేవారు. దాంతో ఈ వ్యవహారం కాస్త దుర్వినియోగం అయ్యిందనే విమర్శలు కూడా లేకపోలేదు. అనర్హులకు, కింది స్థాయి సిబ్బంది, దళారులు కుమ్మక్కై కమిషన్లను (Brokers, commissions) దండుకుని చెల్లింపులు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏ ఆసరా లేని వారికి, సాయం అందుకోడానికి మరో దారి లేదనుకున్న వారికి ముఖ్యమంత్రి ఆపన్నహస్తం అందించి ఆదుకోవడం కొత్తేమి కాదు. గ్రామాలు, మండలాలు, నియోజక వర్గాలు, పట్టణాలు, నగరాల స్థాయిలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల వల్ల చేయలేని పనులు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో జోక్యం చేసుకుంటే పరిష్కారం అవుతాయి. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని, వారి సాదకబాధల్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నేరుగా ఆదేశాలు ఇచ్చే పరిస్థితి గతంలో కూడా ఉండేది. రాజశేఖర్‌ రెడ్డి (Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెల్లవారు జామునే ఆశ్రితులు ఆయన నివాసం వద్ద బారులు తీరే వారు. క్రమం తప్పకుండా ప్రతి రోజు ప్రజల నుంచి వినతుల్ని స్వీకరించేవారు.

ఇదిలావుంటే.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy)కి వైసిపి (YCP) అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. వెంకటగిరి సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌ను (Nedurumalli ramkumar)నియమించారు. ఎమ్మెల్యే (MLA)ఉండగానే సమన్వయకర్తను నియమించింది అధిష్టాం. ఇక వెంకటగిరిలోని నేదురుమల్లి (Nedurumalli in Venkatagiri) ఇంటి దగ్గర కోలాహలం నెలకొంది. అయితే, ఈ సీన్ అంతా అరగంటలోనే నడిచింది. ప్రభుత్వంపై ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు చేయడం, ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, మాజీ మంత్రుల (Government leaders, ministers and former ministers)నుంచి రాయక్షన్ రావడం, వెంకటరిగి సమన్వయకర్తగా రామ్‌కుమార్‌ను నియమిస్తారని ప్రచారం జరగడం అరగంటలో జరిగిపోయింది. రామ్‌కుమార్ విషయంలో ప్రచారం జరుగుతుండగా.. ఆనం మీడియా ముందుకు వచ్చారు. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని ప్రెస్‌మీట్‌లో (Press meet)ప్రకటిస్తుండగానే.. మరోవైపు ఆయనను సస్పెండ్ (suspend)చేస్తూ వైసీపీ (YCP) నుంచి ప్రకటన వెలువడింది. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆనం రామనారాయణ రెడ్డిని తప్పిస్తూ.. నేదురుమల్లి రామ్‌కుమార్ నియమిస్తూ ప్రకటన జారీ చేశారు.

అయితే కొన్నిరోజులుగా ప్రభుత్వం, పార్టీ పనితీరుపై రాంనారాయణ తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని పరోక్షంగా ప్రభుత్వంపై మాటల అస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవలే నెల్లూరు జిల్లా రావూరులో (Ravur of Nellore District) జరిగిన వలంటీర్లు, సమన్వయకర్తల సమావేశంలో (meeting of volunteers and coordinators) మాట్లాడుతూ.. నాలుగేళ్లలో మనం ఏం చేశామని ప్రజల్ని మళ్లీ ఓట్లు అడగాలి? అని ఆనం చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా.. మంగళవారం సైదాపురం మండలం (Saidapuram Mandal)లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, సచివాలయాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని.. రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వస్తే… తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు. అనుకున్న పనులు కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే.. ఆయన్ను తప్పిస్తారంటూ ముందుగానే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారం నిజమవగా పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది.

(Kanti Velugu:ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు)

Exit mobile version