end

జనగాంలో పర్యటించనున్న సీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు జనగాం జిల్లా కొడకండ్ల మండలంలో పర్యటించన్నారు. శనివారం పర్యటనలో భాగంగా కేసీఆర్‌ కొడకండ్ల గ్రామంలో గంటపాటు ఉండనున్నారు. రేపు ఉదయం సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌ నుంచి బయలు దేరి మధ్యాహ్నం12 గంటలకు కొడకండ్ల గ్రామానికి చేరుకుంటారు. 12:10 గంటలకు అక్కడ నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తారు. 12:20 గంటలకు పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తారు. అలాగే మండలంలోని రామవరం గ్రామంలో వైకుంఠ దామం, డంపింగ్‌ యాడ్‌ పనులను పరిశీలిస్తారు. అనంతరం 5వేల రైతులతో కలిసి ఆయన సమావేశంలో మాట్లాడనున్నారు. కాగా, చాలా రోజుల తర్వాత సీఎం పర్యటిస్తుండడంతో రాజకీయాల్లో ఆద్యంతం ఆసక్తి రేపుతోంది.

Exit mobile version