మాదకద్రవ్యాల వినియోగం(డ్రగ్స్) కేసులో మరో యాక్ట్రెస్ అరెస్టయింది. హాస్యనటి భారతీ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఆమె నివాసం, కార్యాలయాల్లో ఎన్‌సీబీ దాడులు చేయగా.. 86.5 గ్రాముల గంజాయి లభ్యమయింది. ఈ సందర్భంగా ఎన్‌సీబీ అధికారులు వారిని విచారించగా, గంజాయి సేవిస్తున్నట్లు భారతీ సింగ్, ఆమె భర్త అంగీకరించినట్లు రుజువైంది. మరిన్ని వివరాల కోసం వారిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
ఇంతకుముందు, డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటులు దీపికా పదుకోన్, రకుల్‌ప్రీత్ సింగ్‌ల పేర్లు వినిపించాయి. కానీ, ఇంకా అది అధికారికంగా రుజువు కాలేదు.