end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటికీ ఒకే పరీక్ష
- Advertisment -

ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటికీ ఒకే పరీక్ష

- Advertisment -
- Advertisment -
  • ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటికీ ఒకే పరీక్ష… “స్కోర్ కార్డు”
  • మూడు సంవత్సరాలు వ్యాలిడిటీ.

అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరియు బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఇకనుండి ఒకే పరీక్ష రాసే విధంగా ఆ పరీక్షలో వచ్చిన స్కోర్ కార్డు మూడు సంవత్సరాలు పని చేసే ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దోస్త్ నోటిఫికేషన్ విడుదల…

అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబులిటీ టెస్ట్ (CET) నిర్వహించేందుకు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (NRA) ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం (ఆగస్టు 19-2020) ఆమోదం తెలిపింది.

ప్రభుత్వరంగ సంస్థలలో ఉన్న నాన్ గెజిటెడ్ పోస్టులకు మరియు పబ్లిక్ సెక్టార్ లో ఉన్న బ్యాంకుల్లో వివిధ రకాల ఉద్యోగాలకు ఇకపై NRA -CET(కామన్ ఎలిజిబులిటీ టెస్ట్) నిర్వహిస్తారు. వివిధ రకాల ఉద్యోగ నియామకాల్లో ఈ టెస్ట్ లో వచ్చిన మార్కులు అనే ప్రతిపాదించగా తీసుకుంటారు. ఈ స్కోర్ కార్డు కు మూడు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ మూడు సంవత్సరాల కాల పరిమితి లో జాబు రాకపోతే మరొకసారి ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.

దేశంలో సుమారుగా వివిధ రకాల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల కోసం సుమారుగా 3 కోట్ల మంది పోటీ పడుతూఉంటారు. ఇకపై వారంతా ఈ ఒక్క ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. ఆన్ లైన్ ద్వారా (CET) పరీక్షలు నిర్వహించి. రాష్ట్రాల వారీగా మెరిట్ లిస్ట్ ని విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వలు ఈ మెరిట్ లిస్టు ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేసుకునే విధానాన్ని రూపొందిస్తున్నారు.

సెంట్రల్‌ రైల్వేలో 432 అప్రెంటిస్‌ ఖాళీలు

ఈ విధానం ద్వారా ఎన్నో ప్రయోజనాలు…

👉 ఒకే పరీక్ష రాయడం వల్ల అభ్యర్థికి సమయం ఆదా అవుతుంది డబ్బులు కూడా ఆదా అవుతాయి.

👉అభ్యర్థికి ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది

👉 రకరకాల బోర్డులు నిర్వహించే పరీక్షలకు రకరకాల కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది ఈ విధానంలో ఆ ఇబ్బంది తొలగిపోతుంది.

👉వివిధ రకాల ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం లక్ష రూపాయలు ఖర్చు చేసుకుని, మెటీరియల్ కోసం వెదుకులాట పూర్తిగా తగ్గిపోతుంది.

👉 పేదరికంలో ఉన్న అభ్యర్థి వివిధ రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి వెళ్లలేక దొరికిన చిన్న ఉద్యోగంలో సరిపెట్టుకునే విధానం ఖచ్చితంగా మారుతుంది.

👉వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను వేగవంతంగా భర్తీ చేయడానికి ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది.

NRA ఏర్పాటు మరియు CET (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్) ప్రణాళిక తయారు చేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశ సమయంలో ఫిబ్రవరిలోనే తెలిపారు.

తెలంగాణ గురుకుల కళాశాల ప్రవేశం గడువు పెంపు

తాజా నిర్ణయంతో దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఎంతగానో తోడ్పడుతుందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ గారు తెలియజేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -